Osmania University: ఓయూ పూర్వవిద్యార్థి భారీ విరాళం
ఈ మేరకు సోమవారం ఓయూ వీసీ ప్రొ.రవీందర్‌కు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం తరగతి గదుల నిర్మాణానికి రూ.5 కోట్ల చెక్కును అందజేశారు. నగరానికి చెందిన గోపాల్ టీకే కృష్ణ మెథడిస్ట్ బాయ్స్ హయ్యర్ సెండరీ స్కూల్‌లో చదివారు. ఓయూలో ఇంజినీరింగ్ పూర్తి చేసి అమెరికాలో స్థిరపడ్డారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్య మండలి కార్యదర్శి ప్రొ.శ్రీరామ్ వెంకటేష్, ప్రిన్సిపాల్ ప్రొ.చంద్రశేఖర్, ప్రొ.మంగు, అలూమ్ని అధ్యక్షులు డాక్టర్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
డీఎస్సీతో పాటు టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి
ఖైరతాబాద్: మెగా డీఎస్సీ ప్రకటించి.. 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిరుద్యోగులు విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. టీచర్ పోస్టులు భర్తీ చేయడంతో పాటు పాఠశాలలను పటిష్టం చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి మెగా డీఎస్సీ ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. అయితే, టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలన్నారు. మెగా డీఎస్సీ ప్రకటించక ముందే నిరుద్యోగ బీసీ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి ఖాళీలు నిర్ణయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇరవై ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఐదు వేల ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ నాయకత్వంలో నిర్వహించిన ముట్టడి కార్యక్రమంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు పాల్గొన్నారు.