NCERT Notification 2024: ఎన్‌సీఈఆర్‌టీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ను విడుదల
సాక్షి ఎడ్యుకేషన్:
న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ).. దేశవ్యాప్తంగా ఐదు ప్రాంతీయ విద్యా సంస్థ(ఆర్‌ఐఈ)ల్లో వివిధ ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎన్‌సీఈఆర్‌టీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్–2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
» ఆర్‌ఐఈ ఉన్న ప్రాంతాలు: అజ్‌మేర్, భువనేశ్వర్, భోపాల్, మైసూర్, షిల్లాంగ్.
కోర్సులు–ఆర్‌ఐఈ క్యాంపస్ వివరాలు
» బీఎస్సీ బీఈడీ (నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు)–భువనేశ్వర్, మైసూరు.
» బీఏ బీఈడీ(నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్)–భువనేశ్వర్, మైసూరు.
» ఎంఎస్సీఈడీ(ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్)–మైసూరు.
» బీఈడీ(రెండేళ్లు)–అజ్‌మేర్, భువనేశ్వర్, భోపాల్, మైసూర్, షిల్లాంగ్.
» బీఈడీ–ఎంఈడీ(మూడేళ్లు)–భోపాల్.
» ఎంఈడీ(రెండేళ్లు)–అజ్‌మేర్, భువనేశ్వర్, భోపాల్, మైసూర్.
» అర్హత: కోర్సును అనుసరించి 10+2/హయ్యర్ సెకండరీ/సీనియర్ సెకండరీ, డిగ్రీ, పీజీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
» ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, కౌన్సిలింగ్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.05.2024
» ప్రవేశ పరీక్ష తేది: 16.06.2024.
» బీఎస్సీ బీఈడీ, బీఏ బీఈడీ, ఎంఎస్సీఈడీ పరీక్ష ఫలితాల వెల్లడి తేది: 05.07.2024.
» బీఈడీ, ఎంఈడీ పరీక్ష ఫలితాల ప్రకటన తేది: 10.07.2024.
» వెబ్‌సైట్: https://cee.ncert.gov.in