CDSE 2024 Notification: డిఫెన్స్‌లో కొలువులకు సీడీఎస్‌ఈ(2)–2024 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులకు చివరి తేదీ!
సాక్షి ఎడ్యుకేషన్: బ్యాచిలర్ డిగ్రీ తర్వాత.. డిఫెన్స్‌లో కొలువుల కోసం ఎదురుచూసే వారికి చక్కటి అవకాశం స్వాగతం పలుకుతోంది! అదే.. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్!! ఈ పరీక్షలో విజయం సాధించి, దశలోనూ ప్రతిభ చూపితే.. త్రివిధ దళాల్లో కమిషన్డ్ ర్యాంకు హోదాతో కొలువుదీరొచ్చు! ఈ ఉద్యోగంతో త్రివిధ దళాల్లో ఉజ్వల కెరీర్‌తోపాటు దేశ సేవ చేసే ఉన్నత అవకాశం లభిస్తుంది. తాజాగా.. సీడీఎస్‌ఈ(2)–2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. సీడీఎస్‌ఈ (2) వివరాలు, ఎంపిక విధానం, వేతనాలు తదితర వివరాలు..
Degree Admissions: నూతన విద్యా సంవత్సరంలో డిగ్రీ ప్రవేశానికి దరఖాస్తులు..
మొత్తం 459 పోస్ట్‌లు
త్రివిధ దళాల్లో పోస్టుల భర్తీకి యూపీఎస్సీ ఏటా రెండుసార్లు సీడీఎస్ పరీక్ష నిర్వహిస్తుంది. తాజాగా మొత్తం 459 పోస్ట్‌ల భర్తీకి సీడీఎస్‌ఈ (2)–2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఇండియన్ మిలటరీ అకాడమీ (డెహ్రాడూన్)–100 పోస్టులు, ఇండియన్ నేవల్ అకాడమీ(ఎజిమలా)–32 పోస్టులు, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ (హైదరాబాద్)–32 పోస్టులు, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (చెన్నై) (పురుషులు)–276 పోస్టులు, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (చెన్నై) (మహిళలు)–19 పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు.
అర్హతలు ఇలా
- ఇండియన్ మిలటరీ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
- ఇండియన్ నేవల్ అకాడమీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
- ఎయిర్‌ఫోర్స్ అకాడమీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా బీఈ/బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి. ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ గ్రూప్ చదివుండాలి.
- ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ సమయానికి సర్టిఫికెట్లు చూపించాల్సి ఉంటుంది.
NCERT Notification 2024: ఎన్‌సీఈఆర్‌టీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ను విడుదల
వయసు
- ఇండియన్ మిలటరీ అకాడమీ: జూలై 2, 2001–జూలై 1, 2006 మధ్య జన్మించి ఉండాలి.
- నేవల్ అకాడమీ: జూలై 2, 2001–జూలై 1, 2006 మధ్య జన్మించి ఉండాలి.
- ఎయిర్‌ఫోర్స్ అకాడమీ: జూలై 2, 2001–జూలై 1, 2005 మధ్య జన్మించి ఉండాలి. (డీజీసీఏ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్న వారికి రెండేళ్ల సడలింపు ఇస్తారు).
- ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ: జూలై 2, 2000–జూలై 1, 2006 మధ్య జన్మించి ఉండాలి.
రెండంచెల ఎంపిక ప్రక్రియ
ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లలో ఆఫీసర్ కేడర్ పోస్ట్‌ల భర్తీకి రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వíß స్తారు. వీటిలో మొదటిది.. యూపీఎస్‌సీ నిర్వహించే సీడీఎస్ రాత పరీక్ష. ఇందులో నిర్దిష్ట కటాఫ్ మార్కులు సాధించి మెరిట్ జాబితాలో నిలిస్తే.. మలి దశలో ఆయా దళాలకు చెందిన సర్వీస్ సెలక్షన్ బోర్డ్‌లు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. ఈ ప్రక్రియలోనూ విజయం సాధించి తుది జాబితాలో నిలిస్తే.. అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న విభాగంలో కొలువు ఖరారవుతుంది.
Elorda Cup 2024: ఎల్డోరా కప్ టోర్నమెంట్‌లో నిఖత్ జరీన్‌కు స్వర్ణం.. 12 పతకాలు సాధించిన భారత్..
రాత పరీక్ష ఇలా
- తొలిదశలో నిర్వహించే సీడీఎస్‌ఈ రాత పరీక్ష ఆయా విభాగాలకు వేర్వేరుగా ఉంటుంది.
- ఇండియ మిలటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ అభ్యర్థులకు 300 మార్కులకు; ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ అభ్యర్థులకు 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహించే రాత పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ నిబంధన అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కు కోత విధిస్తారు.
- ఇండియన్ మిలటరీ, నేవల్, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ కోర్సుల పరీక్షలో ఇంగ్లిష్ వంద మార్కులకు, జనరల్ నాలెడ్జ్ వంద మార్కులకు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ వంద మార్కులకు ఉంటాయి. ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం 2 గంటలు.
- ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పరీక్షలో ఇంగ్లిష్ వంద మార్కులకు, జనరల్ నాలెడ్జ్ వంద మార్కులకు నిర్వహిస్తారు. వీటికి కూడా ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం 2గంటలు. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఉంటుంది.
ఎస్‌ఎస్‌బీ ఎంపిక ప్రక్రియ
- రాత పరీక్షలో నిర్దేశిత కటాఫ్ మార్కులు పొందిన అభ్యర్థులకు సర్వీస్ సెలక్షన్ బోర్డ్(ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. దీనికి 300 మార్కులు కేటాయించారు. అన్ని అకాడమీల అభ్యర్థులకు ఉమ్మడిగా అయిదు రోజులపాటు పరీక్ష జరుగుతుంది. ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి టెస్టులు 6 రోజులపాటు ఉంటాయి.
- మలి దశలో మొదట స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణత సాధిస్తే స్టేజ్–2కు అనుమతిస్తారు. స్టేజ్–1లో ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్(ఓఐఆర్) టెస్ట్‌లు, స్టేజ్–2లో సైకాలజీ టెస్ట్‌లు, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టాస్కులు, ఇంటర్వ్యూలు, కాన్ఫరెన్స్‌లు ఉంటాయి. స్టేజ్–1, స్టేజ్–2ల తర్వాత వర్డ్ అసోసియేషన్ టెస్ట్ (డబ్ల్యూఏటీ), సిట్యుయేషన్ రియాక్షన్ టెస్ట్ (ఎస్‌ఆర్‌టీ)ల ద్వారా విద్యార్థుల సమయస్ఫూర్తిని పరీక్షిస్తారు. చివరగా సెల్ఫ్ డిస్క్రిప్షన్ టెస్ట్(ఎస్‌డీ)లో అభ్యర్థి తన కుటుంబం, స్నేహితులు, కాలేజీ, ఉపాధ్యాయుల గురించి రాయాలి. ఈ టెస్టుల తర్వాత రెండు రోజుల పాటు 9 రకాల గ్రూప్ టాస్క్‌లు నిర్వహిస్తారు.
CPGET Notification 2024: ఈ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు సీపీజీఈటీ–2024 నోటిఫికేషన్!
తుది దశలో ఇంటర్వ్యూ
ఎంపిక ప్రక్రియలోని రెండు దశల్లోనూ విజయం సాధించిన అభ్యర్థులకు చివరగా.. ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూను బోర్డ్ ప్రెసిడెంట్ లేదా సీనియర్ సభ్యుడి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలోనే ఒక ప్రక్రియ కాన్ఫరెన్స్ ఉంటుంది. ప్యానెల్ ముందు అభ్యర్థులు వేర్వేరుగా హాజరవ్వాలి. ఫ్లయింగ్ బ్రాంచ్ వారికి పీఏబీటీ ఉంటుంది. వీటిలో చూపిన ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న అభ్యర్థులకు మరోసారి శారీరక, వైద్య పరీక్షలు నిర్వహించి.. రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ టెస్టుల్లో ప్రతిభ ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు.
అకాడమీలలో శిక్షణ
సీడీఎస్‌ఈ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించిన అభ్యర్థులకు ఎంపికైన అకాడమీల్లో వేర్వేరుగా శిక్షణ ఉంటుంది. ఇండియన్ మిలటరీ అకాడమీ (డెహ్రాడూన్)లో 18 నెలలు, నేవల్ అకాడమీలో 17 నెలలు, ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 18 నెలలు, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 11 నెలలు శిక్షణ అందిస్తారు. ఈ శిక్షణ సమయంలో వీరికి నెలకు రూ.56,100 స్టైపెండ్ అందిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత లెఫ్ట్‌నెంట్ హోదాలో పర్మనెంట్ కొలువు సొంతమవుతుంది. నేవీలో మాత్రం ప్రారంభంలో సబ్–లెఫ్ట్‌నెంట్ హోదా లభిస్తుంది. ఎయిర్‌ఫోర్స్‌లో శిక్షణ పొందిన వారు ప్రారంభంలో ఫ్లయింగ్ ఆఫీసర్‌గా విధులు చేపడతారు. ఇలా ఆయా విభాగాల్లో అడుగుపెట్టిన వారు కొన్ని నెలలు ప్రొబేషన్‌లో ఉంటారు.
ITI Admissions 2024: ఐటీఐలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఎప్పుడంటే..
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, జూన్ 4
- ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ అవకాశం: 2024, జూన్ 5 – జూన్ 11
- పరీక్ష తేదీ: 2024, సెప్టెంబర్ 1
- వివరాలకు వెబ్‌సైట్: www.upsc.gov.in
రాత పరీక్షలో రాణించేలా
- ఇంగ్లిష్: ఈ విభాగం వంద మార్కులకు ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్ భాషపై పట్టును, ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పరిశీలిస్తారు. యాంటానిమ్స్, సినానిమ్స్, స్పాటింగ్ ద ఎర్రర్స్, ఆర్డరింగ్ ఆఫ్ సెంటెన్సెస్, సెంటెన్సెస్‌లో పదాల ఆర్డరింగ్, ప్యాసేజ్‌లు, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, క్లోజ్డ్ టెస్టు, ఫిల్ అప్స్, అనాలజీస్ సెక్షన్ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, స్పాటింగ్ ద ఎర్రర్స్ విభాగాల్లో మార్కులు సాధించేందుకు గ్రామర్ రూల్స్ తెలుసుకోవాలి.
- జనరల్ నాలెడ్జ్: అభ్యర్థులకు సామాజిక అంశాల పట్ల ఉన్న అవగాహన పరీక్షించే విభాగమిది. దీనికి కూడా వంద మార్కులు కేటాయించారు. ఈ విభాగంలో కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఎకనామిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తదితర సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. డిఫెన్స్‌కు సంబంధించిన ప్రధాన కార్యాలయాలు, అవార్డులు, జాయింట్ మిలిటరీ ఎక్సెర్‌సెజైస్ –అందులో పాల్గొన్న దేశాలు, ఆయా ఉమ్మడి సైనిక విన్యాసాల పేర్లు మొదలైన వాటిని తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు.
- ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్: ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీకి మినహా మిగతా పోస్టులకు మ్యాథమెటిక్స్ విభాగం ఉంటుంది. వంద మార్కులకు జరిగే విభాగం ఇది. పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. టైమ్ అండ్ డిస్టెన్స్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా, లీనియర్ అండ్ క్వాడ్రటిక్ ఈక్వేషన్స్, ట్రిగనోమెట్రీ, ఫ్యాక్టరైజేషన్ తదితర చాప్టర్ల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
AP ITI Admission 2024: ఐటీఐ చదువుతుండగానే జాబ్ ట్రైనింగ్.. ఈ కోర్సు పూర్తయితే ఉద్యోగం సులువే..!
Tags
- CDSE notification
- UPSC
- Entrance Exam
- age limit for CDS
- online applications
- Defense Jobs
- service
- preparation for cds exam
- Coaching for CDS
- Interviews
- Eligible Candidates
- Posts details at CDS
- Combined Defense Services Examination
- Education News
- Sakshi Education News
- ThreeForcesCareer
- CDSEDetails
- SelectionProcess
- WagesAndBenefits
- latest jobs in 2024
- saksieducation latest job notifications