Elorda Cup 2024: ఎల్డోరా కప్ టోర్నమెంట్‌లో నిఖత్ జరీన్‌కు స్వర్ణం.. 12 పతకాలు సాధించిన భారత్..
ఎల్డోరా కప్ టోర్నమెంట్‌లో నిఖత్ స్వర్ణ పతకం గెలుచుకుంది.
52 కేజీల విభాగంలో మే 18వ తేదీ జరిగిన ఫైనల్లో నిఖత్ 5–0 పాయింట్ల తేడాతో స్థానిక బాక్సర్, కజకిస్తాన్‌కు చెందిన జజీరా ఉరక్‌బయెవాపై ఘన విజయం సాధించింది. మరో భారత బాక్సర్ మీనాక్షి కూడా పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. 48 కేజీల విభాగం ఫైనల్లో మీనాక్షి 4–1తో రహ్మొనొవా సైదాహొన్ (ఉజ్బెకిస్తాన్)ను ఓడించింది.
అయితే ఫైనల్లో ఓడిన మరో ఇద్దరు భారత బాక్సర్లు అనామిక (50 కేజీలు), మనీషా (60 కేజీలు) రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. ఓవరాల్‌గా ఈ టోర్నమెంట్‌లో భారత్ మొత్తం 12 పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఇందులో 2 స్వర్ణాలు, 2 రజతాలు, 8 కాంస్యాలు ఉన్నాయి.
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌కు దూరమైన భారత మహిళా బాక్సర్!!
భారత బాక్సర్ల పతకాల వివరాలు..
స్వర్ణం: నిఖత్ జరీన్ (52 కేజీలు), మీనాక్షి (48 కేజీలు)
రజతం: అనామిక (50 కేజీలు), మనీషా (60 కేజీలు)
కాంస్యం: జ్యోతి (54 కేజీలు), వినీత (57 కేజీలు), సిమ్రన్ (66 కేజీలు), వర్షిణి (+81 కేజీలు), ధనశ్రీ (46 కేజీలు), లక్ష్మీ (60 కేజీలు), ప్రియాంక (70 కేజీలు), అర్షిత (+81 కేజీలు)