Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌కు దూరమైన భారత మహిళా బాక్సర్!!
ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) సస్పెన్షన్ వల్లే ఆమె పారిస్ విశ్వక్రీడలకు దూరం కానుంది.
‘వాడా’ రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్టీపీ) నియమావళి ప్రకారం ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నారనే సమాచారాన్ని ఇవ్వడంలో విఫలమైంది. గత 12 నెలలుగా మూడుసార్లు పర్వీన్ ఈ సమాచారాన్ని ఇవ్వలేకపోవడంతో ‘వాడా’ ఆమెపై 22 నెలలు నిషేధం విధించింది. పర్వీన్ ఈ తప్పిదాన్ని ఉద్దేశపూర్వకంగా చేయలేదని ‘వాడా’ అధికారులకు భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) వివరణ ఇచ్చింది.
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌కు సిద్ధంగా ఉన్న ఏడుగురు భారత షట్లర్లు వీరే..
దాంతో ‘వాడా’ ఈ నిషేధాన్ని 14 నెలలకు కుదించింది. మే 17వ తేదీ మొదలైన ఈ నిషేధం వచ్చే ఏడాది జూలై వరకు కొనసాగుతుందని బీఎఫ్‌ఐ తెలిపింది. గత ఏడాది హాంగ్జౌలో జరిగిన జరిగిన ఆసియా క్రీడల్లో మహిళల 57 కేజీల కేటగిరీలో పర్వీన్ కాంస్య పతకం సాధించి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.
భారత్ నుంచి ఇప్పటికే ముగ్గురు మహిళా బాక్సర్లు (నిఖత్ జరీన్–50 కేజీలు, ప్రీతి–54 కేజీలు, లవ్లీనా బొర్గొహైన్–75 కేజీలు) పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందారు.
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత పురుషుల-మహిళల రిలే జట్లు..