Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌కు భారత రిలే జట్లు అర్హత
ఆంధ్రప్రదేశ్ అమ్మాయి దండి జ్యోతిక శ్రీ, రూపల్ చౌధరీ, పూవమ్మ, శుభ వెంకటేశన్‌లతో కూడిన భారత మహిళల రిలే జట్టు రెండో హీట్‌లో 3 నిమిషాల 29.35 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానాన్ని దక్కించుకొని పారిస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
4 x 400 మీటర్ల విభాగంలో భారత మహిళల జట్టు ఒలింపిక్స్‌కు అర్హత పొందడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. గత టోక్యో ఒలింపిక్స్‌లో ఈ విభాగంలో భారత జట్టు అర్హత పొందలేదు. మరోవైపు అనస్ యాహియా, మొహమ్మద్ అజ్మల్, అరోకియా రాజీవ్, అమోజ్ జేకబ్‌లతో కూడిన భారత పురుషుల 4 x 400 మీటర్ల రిలే జట్టు కూడా పారిస్ ఒలింపిక్స్ టికెట్‌ను దక్కించుకుంది.
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌కు సిద్ధంగా ఉన్న ఏడుగురు భారత షట్లర్లు వీరే..
రెండో హీట్‌లో అనస్, అజ్మల్, అరోకియా, అమోజ్ బృందం 3 నిమిషాల 3.23 సెకన్లలో లక్ష్యానికి చేరి రెండో స్థానంతో ఒలింపిక్స్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఒలింపిక్స్‌కు అర్హత పొందడం భారత పురుషుల రిలే జట్టుకిది నాలుగోసారి. టోక్యో ఒలింపిక్స్‌లో, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత రిలే జట్టు పతకాలు సాధించకపోయినా కొత్త ఆసియా రికార్డులను నెలకొల్పింది. వరల్డ్ రిలే పోటీల ద్వారా మొత్తం 70 జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి.
Tags
- World Athletics Relays 2024
- Jyothika Sri Dandi
- Paris Olympics
- M R Poovamma
- Rupal Chaudhary
- Subha Venkatesan
- Muhammed Anas Yahiya
- Muhammed Ajmal
- Paris Olympics 2024
- World Athletics Relay Championships
- Indian relay teams
- Qualifications
- Rupal Chowdhury
- Poovamma
- Subha Venkatesan
- sakshieducation sports news