ITI Admissions 2024: ఐటీఐలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఎప్పుడంటే..
కడప ఎడ్యుకేషన్: కడప ప్రభుత్వ డీఎల్‌టీసీ ఐటీఐలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయడానికి జూన్ 10వ తేదీ వరకు గడువు ఉందని ప్రభుత్వ డీఎల్‌టీసీ ఐటీఐ అసిస్టెంట్ డైరెక్టర్ రత్నరాజు తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు https://iti.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ ఐటీఐలో చేరడానికి ఎలాంటి ఫీజులు, డోనేషన్స్ కట్టవలసిన అవసరం లేదని తెలిపారు.
డీఎల్‌టీసీ ఐటీఐలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మిషనిస్టు, మోటార్ మెకానిక్, టర్నర్, డీజిల్ మెకానిక్, వెల్డర్, కార్పెంటర్ ట్రేడ్‌లలో సీట్లు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు తమ అన్ని సర్టిఫికెట్లు, ఒక ఫొటో, ఆధార్, తల్లి, తండ్రి ఆధార్‌కార్డు తీసుకుని నేరుగా కడప ఐటీఐ సర్కిల్‌లోని ప్రభుత్వ డీయల్‌టీసీ ఐటీఐ కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు.
ITI Admissions 2024: ఐటీఐ అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం
ఇతర వివరాలకు 8555958200, 9948827811 నెంబర్లను సంప్రదించాలని డిఎల్‌టీసీ ఐటీఐ అసిస్టెంట్ డైరెక్టర్ రత్నరాజు తెలిపారు.