IPS Officer Umesh Ganpat Success Story : నాడు ఫెయిల్​ స్టూడెంట్.. నేడు స‌క్సెస్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీస‌ర్ అయ్యాడిలా.. విజయానికి తొలి మెట్టు ఇదే..

ఫెయిల్ అయితేనే జీవితం విలువ తెలుస్తోంది. వైఫల్యంలోనే మ‌నం ఎన్నో విష‌యాలు తెలుసుకుంటాం. స‌రిగ్గా ఈ ఐపీఎస్ కూడా విద్యార్థి ద‌శ‌లో ఇంగ్లిష్​లో ఫెయిల్ అయ్యాడు.
Umesh Ganpat Khandbahale, IPS Officer

కానీ ఫెయిల్ అయ్య‌న‌ని నిరాశ చెందలేదు. దృఢ సంకల్పంతో ముందుకు సాగాడు. నేడు యూపీఎస్సీలో మంచి ర్యాంక్ సాధించి ఐపీఎస్ ఆఫీస‌ర్ అయ్యాడు. ఈ ఐపీఎస్ ఆఫీస‌రే.. మహారాష్ట్రకు చెందిన ఉమేశ్ గణపత్. ఈ నేప‌థ్యంలో ఉమేశ్ గణపత్, ఐపీఎస్ స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం :
ఉమేశ్ గణపత్.. మహారాష్ట్రకు చెందిన వారు. వీరిది వ్యవసాయ కుటుంబం. 

➤ Sarojini Lakda and Emelda Ekka Success Stroy : కానిస్టేబుల్స్ నుంచి ఐపీఎస్ అయ్యారిలా.. కానీ..

ఎడ్యుకేష‌న్ :
ఉమేశ్ గణపత్..  పదో తరగతి తర్వాత.. ఇంటర్​​లో జాయిన్​ అయ్యారు. అయితే, 2003లో ఇంటర్​ ఇంగ్లిష్​లో 21 మార్కులు తెచ్చుకుని ఫెయిల్​ అయ్యారు. ఫెయిల్ అయ్యాన‌ని ఎలాంటి నిరాశ చెందలేదు. తిరిగి తన స్నేహితుల ప్రొత్సాహంతో మళ్లీ చదువుపై దృష్టి పెట్టారు. అలా మహారాష్ట్ర ఓపెన్​ యూనివర్సిటీలో ఇంగ్లిష్​ లిటరేచర్​లో డిగ్రీ పూర్తి చేశారు. దీంతో పాటు బీడీ, బీఎస్​సీ హార్టికల్చర్​ కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత ఇంగ్లిష్​లో మాస్టర్స్​ చేశారు.

మొదటి ప్రయత్నంలోనే..

అలా చదువుతున్న సమయంలోనే మహారాష్ట్రలో ఎస్ఐ​ పరీక్ష రాశారు. అందులో మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించారు. ఆ ఉత్సాహంతోనే యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) నిర్వ‌హించే సివిల్స్‌ పరీక్ష రాశారు. అందులో 704వ ర్యాంక్​ సాధించి.. ఐపీఎస్​గా సెలెక్ట్​ అయ్యారు.

☛ Inspirational Story : ప్రభుత్వ బడిలో చ‌దువు.. తండ్రి స్థానంలో ఎస్ఐగా బాధ్యతలు.. ఈ అరుదైన సంఘటన ఎక్క‌డంటే..

ఇంగ్లిష్​లో ఫెయిల్ అయిన విద్యార్థి ఐపీఎస్​ పాస్​ అయ్యారు. దృఢ సంకల్పంతో యూపీఎస్సీ క్లియర్​ చేశారు. ఇటీవలే ఐపీఎస్​గా బాధ్యతలు చేపట్టారు. పరీక్షల్లో ఫెయిల్​ కావడం జీవితానికి ముగింపు కాదంటున్నారు మహారాష్ట్రకు చెందిన ఉమేశ్ గణపత్​.

విజయానికి తొలి మెట్టు ఇదే.. ఉదాహార‌ణ :

మానవ పరిణామ క్రమాన్ని ప్రతిపాదించిన సిద్ధాంతకర్త డార్విన్​ను​ ఒకప్పుడు సాధారణ విద్యార్థిగా పరిగణించారు. బల్బు కనిపెట్టి మానవ జీవితాల్లో వెలుగు నింపిన థామస్​ అల్వా ఎడిసన్​ను.. తెలివి తక్కువ వాడన్నారు. కానీ.. వారు ఎవరూ చేరుకోలేనంత ఎత్తుకు ఎదిగారు. వైఫల్యం.. విజయానికి తొలి మెట్టు అనడానికి వీరి విజయ గాథలే చక్కటి ఉదాహరణలు. ఆ కోవలోకే వస్తారు మహారాష్ట్రకు చెందిన ఉమేష్​ గణపత్ ఖండ్‌బహలే. ప్రస్తుతం బంగాల్​లోని జల్పాయ్​గుడి జిల్లా పోలీసు సూపరింటెండెట్​గా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు.

☛ IPS Officer Success Story : ఎటువంటి కోచించి లేకుండానే.. సివిల్స్ కొట్టా.. ఐపీఎస్ అయ్యా.. కానీ

విద్యార్థులు పరీక్షలో ఫెయిల్ అయితే..

కొన్ని సార్లు చిన్న చిన్న ఓటముల వల్ల చాలా మంది నిరాశ చెందుతారు. అందుకే నేను కూడా రెండేళ్లు చదువు ఆపేశాను. పరీక్షలో ఫెయిల్ కావడం.. విద్యార్థుల జీవితానికి ముగింపు కాదు. అయితే, ఇలాంటివన్నీ ఓటములు కాదు. అవి మన జీవితంలో ఒక భాగం. అలా వినూత్నంగా ముందుకెళ్లాలి. ఇలా వెళ్లేటప్పుడు మనం ఓటమిపాలవుతాం. అయినా.. నిరాశ చెందకూడదు. వాటిని పట్టుదలతో అధిగమించవచ్చు. కాబట్టి ఎవరైనా ఆశను కోల్పోకూడదు. దృఢ సంకల్పంతో లక్ష్యాన్ని చేరుకోవాలి.

☛ Inspirational IAS Success Story : డబ్బు కోసం ఆ ప‌ని చేశా.. చివ‌రికి ఇలా చ‌దివి ఐఏఎస్ ఆఫీస‌ర్ అయ్యానిలా.. కానీ..

☛➤ Success Story: ఒక‌టి త‌ర్వాత ఒక‌టి... ఆరు ప్ర‌భుత్వ ఉద్యోగాలు సాధించిన హైద‌రాబాదీ కుర్రాడు... ఎలా సాధించాడంటే..

ఒక దారి మిస్ అయితే..

ఐపీఎస్​గా పోస్టింగ్​ వచ్చాక.. కూచ్‌బెహార్ జిల్లాలోని దిన్హటా ఎస్​డీపీఓ (సబ్​ డివిజనల్​ పోలీస్​ ఆఫీసర్)గా చేశారు ఉమేశ్​. 2020లో అలీపుర్‌దువార్ జిల్లాలో అదనపు పోలీసు సూపరింటెండెంట్‌గా పనిచేశారు. ఇటీవలే ఉమేశ్ గణపత్​ జల్పాయ్​గుడి పోలీసు సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. ఓటమి.. అన్నింటికీ ముగింపు కాదని.., బలమైన ఆలోచన, స్థిర లక్ష్యం ఉంటే మార్పు వస్తుందని.. దృఢ సంకల్పంతో లక్ష్యాన్ని చేరుకోవాల‌న్నారు. మ‌న ల‌క్ష్య సాధ‌న‌లో ఎన్నో అడ్డంకులు వ‌స్తాయ‌ని.. ఒక దారి మిస్ అయితే.. మ‌రో దారి కూడా క‌శ్చితంగా ఉంటుంద‌న్నారు. ప్ర‌తి విద్యార్థి నిరాశ చెందకుండా.. ల‌క్ష్యం వైపు ముందుకు సాగాల‌న్నారు.

➤☛ UPSC Civils 110 Ranker Nidhi Pai Interview : నా స‌క్సెస్ మంత్రం ఇదే..| ఈ ల‌క్ష్యం కోస‌మే సివిల్స్ వైపు వ‌చ్చా.. కానీ..

☛ R.C.Reddy : Civils, Groups ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల‌కు.. మేము చెప్పే మూడు స‌క్సెస్ సూత్రాలు ఇవే..| ఇవి పాటిస్తే చాలు.. విజ‌యం మీదే..

☛ Civils 2022 40th Ranker: నా success సీక్రెట్ ఇదే..

#Tags