Skip to main content

Inspirational Story : ప్రభుత్వ బడిలో చ‌దువు.. తండ్రి స్థానంలో ఎస్ఐగా బాధ్యతలు.. ఈ అరుదైన సంఘటన ఎక్క‌డంటే..

తండ్రి.. కూతురు.. ఓ అరుదైన సంఘటన.. అర్థం కావ‌డం లేదా..? అయితే ఈ తండ్రి, కూతురు స్టోరీ చ‌ద‌వండి. ఇప్పటివరకు తాను పని చేస్తున్న పోలీస్ స్టేషన్​కు ఎస్​ఐగా వచ్చిన కుమార్తెకు స్వయంగా బాధ్యతలు అప్పగించారు ఆమె తండ్రి.
Venkatesh Welcomed His Daughter Varsha Story in Telugu
Venkatesh Welcomed His Daughter Varsha

ఈ అరుదైన సంఘటన కర్ణాటకలోని మండ్యలో జరిగింది. మండ్య సెంట్రల్‌ పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ బీఎస్‌ వెంకటేశ్‌ ఎస్పీ ఆఫీసుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలోకి కొత్త ఎస్‌ఐగా బీవీ వర్ష నియమితులయ్యారు. 

☛ Gandrathi Satish, SI: ఇంటర్, డిగ్రీలో ఫెయిల్..ఈ క‌సితోనే మూడు ప్ర‌భుత్వ ఉద్యోగాలు కొట్టానిలా..

తొలి పోస్టింగ్‌ కూడా మండ్యలోనే..
ఎంఏ అర్థశాస్త్రం చదివిన వర్ష 2022 బ్యాచ్‌లో కలబురిగిలో శిక్షణ తీసుకుని ట్రైనీ ఎస్‌ఐగా ఇదే పీఎస్‌లో పనిచేశారు. తొలి పోస్టింగ్‌ కూడా మండ్యలోనే వ‌చ్చింది. అది కూడా తండ్రి పని చేసి బదిలీ అయిన మండ్య సెంట్రల్‌ పోలీసు స్టేషన్‌కే. ఇటీవ‌లే తన తండ్రి వెంకటేశ్‌ నుంచే వర్ష చార్జ్‌ తీసుకుని పూర్తిస్థాయి ఎస్‌ఐగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తండ్రీ కూతురు స్టేషన్‌లోని సిబ్బందికి స్వీట్లు పంచి వేడుక చేసుకున్నారు.

కార్గిల్​ యుద్ధంలోనూ..
వెంకటేశ్​.. తుమకూరు జిల్లా హులియుర్​దుర్గ వాసి. 16 ఏళ్లపాటు సైన్యంలో సేవలు అందించారు. కార్గిల్​ యుద్ధంలోనూ దేశం కోసం పోరాడారు. సైన్యం నుంచి రిటైర్ అయ్యాక కర్ణాటకకు తిరిగివచ్చారు. పోలీస్ నియామక పరీక్ష రాసి.. మిలటరీ కోటాలో సబ్​ఇన్​స్పెక్టర్​ ఉద్యోగం సాధించారు. మండ్య, మైసూరు, కొడగు, చామరాజనగర్ జిల్లాల్లో విధులు నిర్వర్తించారు. ఏడాదిన్నర నుంచి మండ్య సెంట్రల్​ స్టేషన్​లో ఎస్​ఐగా పని చేస్తున్నారు.

☛ SI Raja Ravindra : ఎప్ప‌టికైన‌ నా స్వప్నం ఇదే..దీని కోసం..

నేను సైన్యంలో పని చేశాను. అందుకే కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకపోయాను. పిల్లల్ని దగ్గరుండి సరిగా చదివించలేకపోయాను. నా కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో నా భార్యే చదివించింది. ఇప్పుడు ఈ పోస్టులోకి నా కూతురు రావడం ఎంతో సంతోషకరం. అందుకే నాకు ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయ‌ని వెంకటేశ్ అన్నారు.

వ్యక్తిగత జీవితంలోనూ..

Woman greeted with flowers by father as she takes over his post in police

వెంకటేశ్ కుమార్తె వర్ష ఎంఏ ఎకనామిక్స్ చదివారు. వృత్తి విషయంలో తండ్రి బాటలోనే పయనించారు. పోలీస్ నియామక పరీక్ష రాసి ఎస్​ఐ ఉద్యోగానికి ఎంపికయ్యారు. 2022 బ్యాచ్​లో కలబురిగిలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. మండ్యలో ఏడాదిపాటు ప్రొబేషనరీ ఆఫీసర్​గా పని చేశారు. ఆమెకు తొలి పోస్టింగ్​గా.. తండ్రి వెంకటేశ్​ చేస్తున్న పోలీస్​ స్టేషన్​కు సబ్​ఇన్​స్పెక్టర్​గా నియమించింది ప్రభుత్వం.

☛ IPS Officer Success Story : ఎటువంటి కోచించి లేకుండానే.. సివిల్స్ కొట్టా.. ఐపీఎస్ అయ్యా.. కానీ

మండ్య ఎస్​పీ కార్యాలయానికి బదిలీపై వెళ్తున్న వెంకటేశ్.. వర్షకు అధికారికంగా సెంట్రల్ పోలీస్ స్టేషన్​ ఎస్​ఐ బాధ్యతలు అప్పగించారు. ఈ అరుదైన సన్నివేశాన్ని ఆ ఠాణా సిబ్బంది ఎంతో ఆసక్తిగా తిలకించారు. వెంకటేశ్, వర్ష ఆనందబాష్పాలు రాల్చారు. వ్యక్తిగత జీవితంలో గతంలో ఎదుర్కొన్న సవాళ్లను గుర్తుచేసుకున్నారు.

ప్రభుత్వ బడిలో..
చిన్నతనంలో నా తండ్రిని బాగా మిస్​ అయ్యేదాన్ని. మా అమ్మే నన్ను ప్రభుత్వ బడికి పంపింది. నా తల్లిదండ్రుల కష్టాలు చూస్తూ నేను పెరిగాను. ఇప్పుడు తండ్రి స్థానంలోకి రావడం నాకు సంతోషంగా ఉంది అని చెప్పారు వర్ష.

☛ Group-2 Job:మొదటి ప్రయత్నంలోనే విజయం..గ్రూపు–2లో ఉద్యోగం..ఎలా అంటే..?

Published date : 24 Jun 2023 01:28PM

Photo Stories