Sarojini Lakda and Emelda Ekka Success Stroy : కానిస్టేబుల్స్ నుంచి ఐపీఎస్ అయ్యారిలా.. కానీ..
కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరిన ఇద్దరు మహిళలు.. ఐపీఎస్‌లుగా మారబోతున్నారు. అటు ఉద్యోగంతో పాటు.. ఇటు ఉన్నత విద్యను కొనసాగిస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. వీరే సరోజిని లఖ్డా, ఎమెల్డా ఎక్కా. ఈ నేపథ్యంలో వీరి సక్సెస్ జర్నీ మీకోసం..
కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి.. వీరు..
స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ ఉద్యోగాలు సంపాదించిన వీరు.. అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఏకంగా ఐపీఎస్ పదవినే పొందబోతున్నారు. ఝార్ఖండ్ రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన వీరిని ఐపీఎస్‌లుగా పదోన్నతి ఇవ్వాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు లేఖ రాసింది రాష్ట్రం.
ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 24 మంది అధికారులకు పదోన్నతి కల్పిస్తూ జూన్ 19న నిర్ణయం తీసుకుంది యూపీఎస్సీ. వీరిలో సరోజిని లఖ్డా, ఎమెల్డా ఎక్కా అనే ఇద్దరు క్రీడాకారిణులు ఉన్నారు. వీరిద్దరూ 1986లో స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందారు. సర్వీసులో చేరిన తర్వాత తమ ఉన్నత చదువులను కొనసాగించారు. తాజాగా యూపీఎస్సీ తీసుకున్న నిర్ణయంతో ఐపీఎస్‌గా మారనున్నారు.
అటు ఉద్యోగంతో పాటు ఇటు ఉన్నత విద్యను..
సరోజిని లఖ్డా, ఎమెల్డా ఎక్కా.. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్నా.. కనీసం వీళ్లకు కాళ్లకు వేసుకోవడానికి షూ కూడా ఉండేవి కావు. అలాంటి కఠిన పరిస్థితులను సైతం దాటుకుని వచ్చారొకరు. క్రీడలపై ఆసక్తితో ఏదైనా సాధించాలని అనుకున్నారు మరొకరు. తమ ప్రతిభతో అనేక పతకాలను సాధించారు వీరిద్దరు. స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సైతం సంపాదించారు. అటు ఉద్యోగంతో పాటు ఇటు ఉన్నత విద్యను కొనసాగిస్తూ.. అంచెలంచెలుగా ఎదిగారు. కానిస్టేబుల్‌గా మొదలు పెట్టిన వీరు.. ఇప్పుడు ఐపీఎస్‌లుగా మారారు.
☛ IPS Officer Success Story : ఎటువంటి కోచించి లేకుండానే.. సివిల్స్ కొట్టా.. ఐపీఎస్ అయ్యా.. కానీ
1991లో ఒకేసారి ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి పొందారు సరోజిని, ఎమెల్డా. ఆ తర్వాత 2008లో డీఎస్పీగా.. 2019లో ఎఎస్పీగా ప్రమోషన్ పొందారు.
సరోజిని లఖ్డాకు చిన్ననాటి నుంచే..
లాతేహర్ జిల్లాలోని రామ్సెలీ గ్రామానికి చెందిన సరోజిని లఖ్డాకు చిన్ననాటి నుంచి క్రీడలంటే ఆసక్తి. మహూఅడాండ్లోని సెయింట్ థెరిసా స్కూల్లో చదువుకున్న ఆమె.. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో అనేక పతకాలు సాధించారు.
☛ Group-2 Job:మొదటి ప్రయత్నంలోనే విజయం..గ్రూపు–2లో ఉద్యోగం..ఎలా అంటే..?
1984లో దిల్లీలో జరిగిన ఎస్డీఎఫ్ఐ గేమ్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో మొదటి పతకాన్ని సాధించారు. 100మీ హర్డల్స్, 100, 400 మీటర్ల రిలేతో పాటు హై జంప్, లాంగ్ జంప్, హెప్టాథ్లాన్ పోటీలో అనేక మెడల్స్ పొందారు. 1994 నుంచి ఇప్పటివరకు ప్రతి ఇండియన్ పోలీస్ గేమ్స్‌లో ఈమె పాల్గొంటూనే ఉన్నారు. 2018లో జర్మనీలో ఒలింపిక్ స్టడీస్‌లో ఎంఏను పూర్తి చేశారు.
ఎమెల్డా ఎక్కాకు.. కనీసం షూ కూడా లేవు.. కానీ..
మహూఅడాండ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చైన్పుర్కు చెందిన ఎమెల్డా ఎక్కా కూడా 1986లోనే స్పోర్ట్ కోటాలో కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పొందారు. ఎక్కా.. జాతీయ స్థాయి పోటీల్లో ఉమ్మడి బిహార్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. 100, 200, 400 మీటర్ల రిలే పోటీల్లో అనేక పతకాలను సాధించారు. ఈ పోటీల సమయంలో కనీసం ఆమెకు వేసుకోవడానికి షూ కూడా లేవు.