Skip to main content

Competitive Exams: ఏ పోటీ పరీక్షలకైనా.. రాజకీయ అవగాహన తప్పనిసరి.. ఈ వ్యూహాలను అనుస‌రిస్తే..!

ఏ పోటీ పరీక్షలకైనా దేశ, రాష్ట్ర రాజకీయాలపై అవగాహన కీలకం. గ్రూప్-1, 2 అధికారులకు ఇది మరీ ముఖ్యం. అన్ని స్థాయిల్లో రాజకీయ పరిస్థితులు తెలిసినప్పుడే వారు సమర్థంగా విధులు నిర్వహించగలరు.
political science
Political Science for Competitive Exams

అందుకే గ్రూప్-1తో పాటు గ్రూప్-2లోనూ పొలిటికల్ సైన్స్‌కు స్థానం కల్పించారు. ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్‌లో 8వ అంశంగా భారత రాజ్యాంగం, రాజనీతి శాస్త్రం పొందుపరిచారు. గ్రూప్-1 మెయిన్స్ జనరల్ ఎస్సేలో రెండో అంశంగా డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, భారత చారిత్రక, సాంస్కృతిక వారసత్వం అంశాలను చేర్చారు. పేపరు-3లోనూ పొలిటికల్ సైన్స్ అంశాలున్నాయి. గ్రూపు-2లోనూ పేపరు-2లో ఓవర్ వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్‌స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్‌ను ప్రత్యేకంగా చేర్చారు. ఈ నేపథ్యంలో పాలిటిక్స్‌కు (పొలిటికల్ సైన్స్) సంబంధించిన వివిధ అంశాలపై ప్రిపరేషన్‌లో అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యూహాలపై ఓయూ ప్రొఫెసర్, టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ కృష్ణారెడ్డి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు ఇలా..

ప్రధానంగా పాలిటీ పరిధిలోకి..
గూపు-1కు సిద్ధమయ్యే అభ్యర్థులు ప్రధానంగా పాలిటీ పరిధిలోకి వచ్చే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు, జాతీయ, రాష్ట్ర రాజకీయాలు, అంతర్రాష్ట్ర వివాదాలపై దృష్టి పెట్టాలి. పాలనకు సంబంధించి పార్లమెంటరీ వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి, ప్రధాని తదితర వ్యవస్థలపై అవగాహన పెంచుకోవాలి. పాలిటీలో అభ్యర్థులు దృష్టి పెట్టాల్సిన మరో ముఖ్యాంశం 73, 74 రాజ్యాంగ సవరణలు. స్థానిక సుపరిపాలనకు దోహద పడేలా పంచాయతీరాజ్, మున్సిపాలిటీల ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ప్రభుత్వ పథకాలు, సమకాలీన అంశాలతోపాటు దేశ రాజకీయాలు, రిజర్వేషన్లు, సామాజిక ఉద్యమాలు, పార్టీల వ్యవస్థపై అవగాహన అవసరం. స్వాతంత్య్రానంతర కాలం నుంచి ఇప్పటిదాకా రాజకీయంగా జరిగిన ముఖ్య ఘటనలు, జాతీయ స్థాయిలో పలు పార్టీలు,రాజకీయ సమీకరణలపై అవగాహన ఉండాలి. ప్రభుత్వాలు ముఖ్య నిర్ణయాలు తీసుకోవడానికి కారణమైన పరిస్థితులూ తెలిసుండాలి. 

Government Jobs: గుడ్‌న్యూస్‌.. 30,453 ఉద్యోగాల‌కు అనుమతి.. ముందుగా ఈ శాఖ‌ల్లోనే పోస్టులు భ‌ర్తీ..

వీటిని జాగ్రత్తగా..
గ్రూపు-2 (భారత రాజ్యాంగం, రాజకీయాలు-అవలోకనం) పేపరు-2లో మొదటి విభాగంలో ఇండియా, తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర, రెండో విభాగంలో భారత రాజ్యాంగం, పాలిటిక్స్ అవలోకనం ఉంటాయి. వీటిలో ప్రధానంగా రాజ్యాంగంపై సమగ్ర అవగాహన తెచ్చుకోవడంతోపాటు దేశ సాంఘిక పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు తెలుసుకోవాలి. ఎన్నికలు, అక్రమాలు, ఎన్నికల సంఘం, ఎన్నికల సంస్కరణలు, పార్టీల పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలి. ప్రభుత్వాధికారికి సమాజ స్థితిగతులపై స్పష్టమైన అవగాహన ఉండాలన్న లక్ష్యంతో సిలబస్‌ను రూపొందించారు. ఒక పేపర్‌లోని అంశాలకు, మరో పేపర్‌లోని అంశాలకు సంబంధం ఉంటుంది. నోట్సు రాసుకునేప్పుడే వీటిని జాగ్రత్తగా విభాగాలుగా చేసి సిద్ధం చేసుకోవాలి.

Telangana: భారీగా ప్ర‌భుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు.. ఇక్క‌డి నుంచి చదవాల్సిందే..

రాజకీయ స్థితిగతులపై ప్రశ్నించేలా సిలబస్.. 
తెలంగాణ వచ్చాక ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వహిస్తున్న ఉద్యోగ పరీక్షలివి. సీమాంధ్ర ప్రాంతాల్లో విద్యా విధానానికి, తెలంగాణలో విద్యా విధానానికి తేడా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అభ్యర్థుల ఆలోచన విధానం, ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, ఇన్నాళ్లు ఇక్కడి అభ్యర్థులకే తెలియని తెలంగాణ చరిత్ర, సామాజిక పరిస్థితులు, అసమానతలు, రాజకీయ స్థితిగతులపై ప్రశ్నించేలా సిలబస్ రూపకల్పన జరిగింది. కొత్త రాష్ట్రంలో రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఉన్న అభ్యర్థులను అధికారులుగా, ఉద్యోగులుగా తీసుకునేలా తెలంగాణలో పోటీ పరీక్షలుంటాయి.

Government Jobs: ప్ర‌భుత్వ‌ ఉద్యోగాల‌కు కొత్త రోస్టర్ ఇదే.. ఈ మేర‌కే ఉద్యోగాల భ‌ర్తీ

ఈ వ్యూహాలను అనుస‌రిస్తే.. 
అభ్యర్థులు ప్రధానంగా మూడు రకాల వ్యూహాలు అనుసరించాలి. ఒకటి ఎక్స్‌టెన్సిన్ స్టడీ, రెండోది ఇంటెన్సివ్ స్టడీ. మూడోది పాయింట్లవారీగా నోట్స్ సిద్ధం చేసుకోవడం. ప్రతి సబ్జెక్టు, అంశానికి సంబంధించి పరీక్షలకు సిద్ధమయేప్పుడు వీటిని కచ్చితంగా అనుసరించాలి. తద్వారా సబ్జెక్టుపై అవగాహన తెచ్చుకోవడంతోపాటు పరీక్షల్లో బాగా రాయడం వీలవుతుంది.
1. పరీక్షకు 4 నెలలుందనగా ప్రిపేరయ్యే పోటీపరీక్షకు సంబంధించిన పుస్తకాలను సమగ్రంగా చదవాలి. ఇది ఎక్స్‌టెన్సివ్ స్టడీ.
2. ప్రధానాంశాలపై నోట్స్ సిద్ధం చేసుకోవాలి. పరీక్షకు 2 నెలలుండగా వీటిని మాత్రమే చదువుకోవాలి. ఇది ఇంటెన్సివ్ స్టడీ.
3. ఇక మూడోది పాయింట్స్. పరీక్షకు 15-20 రోజులుందనగా ఈ మూడో వ్యూహాన్ని అనుసరించాలి. ఇంటెన్సిస్ స్టడీ చేసి నోట్స్ రూపొందించుకున్న అంశాలపై పాయింట్లవారీగా మళ్లీ నోట్స్ సిద్ధం చేసుకోవాలి. పరీక్ష వరకూ ఈ పాయింట్లను చదువుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో పుస్తకాలను పట్టుకుని కూర్చోవద్దు. సరైన పుస్తకాలనే ఎంచుకోవడం చాలా ముఖ్యం. పక్కవారు చదువుతున్నారని ఏ పుస్తకం పడితే అది చదవొద్దు. సొంత వ్యూహం ముఖ్యం. ఉదాహరణకు జేఎన్‌యూ, సెంట్రల్ వర్సిటీల విద్యార్థులు చదివే తీరుకు, రాష్ట్ర వర్సిటీల విద్యార్థులు చదివే విధానానికి చాలా తే డా ఉంది.రాష్ట్ర విద్యార్థులే ఎక్కువ సమయం చదువుతారు. కానీ సెంట్రల్ వర్సిటీ, జేఎన్‌యూ విద్యార్థుల సక్సెస్ రేటే ఎక్కువ. కారణం... పుస్తకాల ఎంపికే. కాబట్టి ఈ విషయంలో అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలి.

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఈ పుస్త‌కాల‌ను చ‌దివారంటే..?
ఈ స్వల్ప కాలంలోనే తెలంగాణ చరిత్రంతా రాస్తామంటే కుదరు. ఇలాంటప్పుడు తెలంగాణ చరిత్రే కాదు, ఇతర సబ్జెక్టులకు సంబంధించి కూడా ఇప్పటికిప్పుడు వచ్చిన పుస్తకాలను గుడ్డిగా అనుసరిస్తే నష్టపోతారు. ఫేక్ పుస్తకాలు వందలకొద్దీ మార్కెట్‌లోకొచ్చాయి. అవన్నీ కొనేయొద్దు. బిట్స్ బ్యాంకులపైనా ఆధారపడొద్దు. పుస్తకాల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి. వర్సిటీల్లో లేని విద్యార్థులు అధ్యాపకుల సలహా మేరకు పుస్తకాలను కొనుక్కోవాలి. సుంకిరెడ్డి నారాయణరెడ్డి వంటి వారు రాసినవి కొనవచ్చు. ఉద్యమంలో పాల్గొన్న వారు రాసిన పుస్తకాలూ చదవొచ్చు. తెలంగాణ ఇన్‌ఫర్మేషన్ ట్రస్టు రూపొందించిన పుస్తకాలనూ చదవొచ్చు. ఇవన్నీ గణాంకాలతో కూడుకుని ఉన్నాయి. గ్రూప్-1 అభ్యర్థులు రొమిల్లా థాపర్, బిపిన్‌చంద్ర పుస్తకాలు చదవొచ్చు. ఓబీ గౌబా రాసిన ఇంట్రడక్షన్ టు పొలిటికల్ థియరీ, ఏఆర్ దేశాయ్ రాసిన పొలిటికల్ మూవ్‌మెంట్స్ ఇన్ ఇండియా బాగుంటాయి. ప్రణాళిక విభాగం విడుదల చేసిన సోషియో ఎకనామిక్ ఔట్‌లుక్ చదవాలి. తెలంగాణకు సంబంధించి గౌతమ్ పింగ్లే రాసిన ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ పుస్తకం బాగుంటుంది.

ఈ ఏడాది (2022) తెలంగాణ‌లో భ‌ర్తీ చేయ‌నున్న గ్రూప్స్-1,2,3,4 ఉద్యోగాలు ఇవే..:

గ్రూపు

పోస్టులు

గ్రూప్‌– 1

503

గ్రూప్‌– 2

582

గ్రూప్‌– 3

1,373

గ్రూప్‌– 4

9,168

Group 1&2 Exams Preparation Tips: గ్రూప్స్‌ గెలుపు బాటలో.. విజేతల వ్యూహాలు!

Published date : 23 Apr 2022 06:17PM

Photo Stories