Skip to main content

TSPSC Group 1 Prelims cancelled : బిగ్ బ్రేకింగ్ న్యూస్‌.. గ్రూప్-1 పరీక్ష రద్దు.. అలాగే ఏఈఈ, డీఏవో ప‌రీక్ష‌లు కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప‌రీక్ష‌ను ర‌ద్దు చేశారు. ఈ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను జూన్ 11వ తేదీన నిర్వ‌హించ‌నున్నారు.
TSPSC Group 1 Prelims and aee exam cancelled
TSPSC Group 1 Prelims AEE, DAO and Exam cancelled

గ్రూప్-1తో పాటు ఏఈఈ, డీఏఓ, ఏఈఈ పరీక్షలను రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం కీల‌క‌ తీసుకుంది. గతేడాది అక్టోబ‌ర్‌ 16న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ నిర్వహించారు. అలాగే ఈ ఏడాది జనవరి 22న ఏఈఈ, ఫిబ్రవరి 26న డీఏవో పరీక్షలను నిర్వహించారు.

➤☛ TSPSC Paper Leak Accused Renuka : పేప‌ర్ లీక్ కోసం.. గాలం వేసిందిలా.. చివ‌రికి తానే గాలానికి చిక్కుకుందిలా..
 
ఇటీవల అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) పేపర్‌ లీకేజీ కారణంగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నివేదిక ఆధారంగా ఈ పరీక్షలను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసిన విష‌యం తెల్సిందే.ఏఈఈ, డీఏవో ప‌రీక్ష‌ల తేదీల‌ను కూడా త్వరలో నిర్వహించనున్నారు. మరిన్ని పరీక్షలను కూడా వాయిదా వేసే యోచనలో టీఎస్‌పీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది.

➤☛ TSPSC AE Exam Cancel 2023 : బిగ్ బ్రేకింగ్ న్యూస్‌.. ఏఈ పరీక్ష రద్దు.. మరోసారి రాత పరీక్షకు..

వీటి ఆధారంగానే..

tspsc

ప్రశ్నపత్రాల లీకేజీ కేసు నిందితుడు ప్రవీణ్‌ పెన్‌డ్రైవ్‌ లో ఇప్పటికే గుర్తించిన మూడు పరీక్షల ప్రశ్నపత్రాలతో పాటు, మరో రెండు పరీక్షలకు సంబంధించిన క్వశ్చన్‌ పేపర్లు కూడా ఉన్నట్టు ఎఫ్‌ఎస్‌ఎల్‌ అధికారులు గుర్తించారని తెలుస్తోంది.

ఇంకా ఎంవీఐ, గ్రౌండ్‌వాటర్‌ ఎగ్జామ్‌ పేపర్లు కూడా అతడి పెన్‌డ్రైవ్‌లో ఉన్నట్టు గుర్తించామని ఎఫ్‌ఎస్‌ఎల్‌ అధికారులు ప్రత్యేక దర్యాప్తు బృందానికి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఏఈ పరీక్ష ప్రశ్నపత్రంలాగా మిగతా పరీక్షలకు సంబంధించిన క్వశ్చన్‌ పేపర్లను సైతం ప్రవీణ్‌ ఇంకెవరికైనా ఇచ్చాడా? లేక అతడి పెన్‌డ్రైవ్‌కు మాత్రమే అవి పరిమితమయ్యాయా? అనే విషయాన్ని తేల్చేపనిలో ఎఫ్‌ఎస్‌ఎల్‌ అధికారులు నిమగ్నమయ్యారు. ఈ ప్రశ్నపత్రాల లీకేజీ వ్య‌వ‌హారం తెలంగాణ రాష్ట్రంలో సంచల‌నంగా మారింది.

tspsc group 1 exam cancel

☛➤ టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

Published date : 17 Mar 2023 05:16PM

Photo Stories