TSPSC Group 2 Exams Again Postponed : గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా.. కొత్తగా ఇలా..?
ఇప్పటికే రెండు సార్లు గ్రూప్-2 ఎక్సామ్ పోస్ట్‌పోన్ అయిన విషయం తెలిసిందే. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ సహా పలువురు సభ్యులు రాజీనామా చేయడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిసన్ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు.
కొత్త పోస్టులను చేర్చి రీవైజ్డ్ నోటిఫికేషన్..?
పరీక్ష తేదీ రీ షెడ్యూల్ చేస్తారా.. లేక కొత్త పోస్టులను చేర్చి రీవైజ్డ్ నోటిఫికేషన్ ఇస్తారా అనేది సర్వీస్ కమిషన్ క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు పరీక్షలపై రివ్యూ చేసిన ప్రభుత్వం.. గ్రూప్ ఎగ్జామ్స్‌పై స్పష్టత ఇవ్వలేదు. కాగా తెలంగాణలో గ్రూప్-2కు సంబంధించి 783 పోస్టులకు 5 లక్షల 50 వేల మంది అభ్యర్థుల దరఖాస్తు చేసుకున్నారు.
గ్రూప్-2 వాయిదాల పర్వం ఇలా..
తొలుత ఆగస్టు 29, 30న గ్రూప్-2 పరీక్ష నిర్వహించేందుకు కమిషన్ షెడ్యూలు జారీ చేసింది. వరుసగా గ్రూప్-1, 4 పరీక్షలు, గురుకుల నియామక పరీక్షలతో పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేనందున గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పరీక్షలను నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూలు చేసింది. అయితే నవంబరు 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కమిషన్ ఈ పరీక్షలను మళ్లీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూలు చేసింది. మళ్లి ఇప్పుడు కూడా గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది.
☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్–1,2,3&4 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
కొత్త ప్రభుత్వం ఇలా..
తెలంగాణలో 2024 ఫిబ్రవరి 1వ తేదీన గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు.. అలాగే ఏప్రిల్ 1వ తేదీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు.. జూన్ 1వ తేదీన గ్రూప్ 3& 4 ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలిపిన విషయం తెల్సిందే. అలాగే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు ఉంటాయని మేనిఫెస్టోలో వెల్లడిచింది. ఇంకా పోలీసు, మెడికల్, ఇంజనీరింగ్, ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని తెలిపింది.
Tags
- TSPSC Group 2 January 6th and 7th Exams Again Postponed
- Revanth Reddy Latest News in Telugu
- tspsc exams postponed 2023
- tspsc group 2 again postponed
- tspsc group 2 new exam dates 2024
- tspsc group 2 updates 2024
- tspsc group 2 liveupdates
- tspsc group 2 exams timetable 2024
- TSPSC Group 2 Latest News
- tspsc group 2 exam schedule
- TSPSC Group 2 january 6th and 7th Exams Again Postponed news in telugu
- TSPSC Group-II exam
- Group-2 exam update
- TSPSC News
- TSPSC Group-II latest news
- sakshi education TSPSC exams latest news