TSPSC AE Exam Cancel 2023 : బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఏఈ పరీక్ష రద్దు.. మరోసారి రాత పరీక్షకు..
ఏఈ పేపర్ లీకైనట్లు నిర్ధారణ కావడంతో.. టీఎస్‌పీఎస్సీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 837 అసిస్టెంట్ ఇంజినీర్ (AE) పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబరులో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెల్సిందే. మార్చి 5వ తేదీన టీఎస్‌పీఎస్సీ రాతపరీక్ష నిర్వహించింది.
ఏఈ పోస్టులకు మరోసారి రాత పరీక్ష..
పరీక్షకు రెండ్రోజుల ముందు ప్రశ్నపత్రం లీక్ అయినట్టు గుర్తించిన అధికారులు.. పరీక్ష రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. రాత పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 74 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 55 వేల మంది వరకు హాజరయ్యారు. ఏఈ పోస్టులకు మరోసారి రాత పరీక్ష నిర్వహిస్తామని, పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటిస్తామని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.
న్యాయ నిపుణుల సలహాలు, పరిస్థితులకు అనుగుణంగా..
ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం వెలుగు చూసినప్పటి నుంచి ఏఈ పరీక్ష కొనసాగిస్తారా? రద్దు చేస్తారా? అని అభ్యర్థుల్లో సందేహాలు వ్యక్తమయ్యాయి. సిట్ అధికారుల ప్రాథమిక నివేదిక, పరీక్షపై న్యాయ నిపుణుల సలహాలు, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నట్టు కమిషన్ చెబుతోంది. మార్చి 14వ తేదీన (మంగళవారం) దీనిపై నిర్ణయం తీసుకోవాలనుకున్నా.. సాంకేతిక కారణాలతో సమావేశాన్ని వాయిదా వేసింది. దీంతో ఇవాళ టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో విచారణ జరిపిన సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ కీలక ఆధారాలు సేకరించారు. దీంతో పేపర్ లీకేజీ వ్యవహారంపై పూర్తి స్థాయి స్పష్టత వచ్చింది.
☛➤ TSPSC Exams Postponed 2023 : షాకింగ్ న్యూస్.. టీఎస్‌పీఎస్సీ పరీక్షలు వాయిదా.. కారణం ఇదే
టీఎస్‌పీఎస్సీ ఏఈ పరీక్ష రద్దుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..