Staff Nurse: పరీక్ష హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: స్టాఫ్ నర్స్ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే ప్రక్రియను జూలై 25న ప్రారంభించారు.
పరీక్ష హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం
స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ఆగష్టు 2వ తేదీన కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవా లని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు జూలై 25 నుంచి ఆగస్టు ఒకటో తేదీ సాయంత్రం 5 గంటల వరకు తమ వెబ్‌సైట్ https://mhsrb.telangana.gov.in ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.