మహారాణిపేట: స్టాఫ్ నర్సు పోస్టుల దరఖాస్తు గడువు అక్టోబర్ 5తో ముగిసింది. రాష్ట్రంలో 434 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా.. జోన్–1 పరిధిలో మొత్తం 86 నర్సు పోస్టుల కోసం సెప్టెంబర్ 20 నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
86 పోస్టులకు ఏకంగా 9,100 దరఖాస్తులు
జోన్–1 పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన 9,100 మంది దరఖాస్తు చేసుకున్నారు. త్వరలోనే అర్హుల జాబితాను విడుదల చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ ఎన్.ఉమా సుందరి వెల్లడించారు.