Skip to main content

371 Jobs: వైద్య, ఆరోగ్యశాఖలో మరో 371 పోస్టులకు నోటిఫికేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: వైద్య, ఆరోగ్యశాఖలో కొలువుల జాతర కొనసాగుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 7,300 పోస్టులను భర్తీ చేయగా...మరో 6,500 పో స్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.
Notification for 371 more posts in Medical and Health Department  Medical and Health Services Recruitment Board announcement for Nursing Officer and Pharmacist vacancies  Notification for additional Nursing Officer and Pharmacist posts in the Medical and Health Department  Recruitment notice for Nursing Officer and Pharmacist positions by the Medical and Health Services  Job vacancies in the medical sector: Nursing Officer and Pharmacist posts available

తాజాగా మరో 272 నర్సింగ్‌ ఆఫీసర్‌ (స్టాఫ్‌ నర్స్‌) పోస్టులు, 99 ఫార్మసిస్ట్‌ (గ్రేడ్‌ 2) పోస్టుల భర్తీకి మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గత నెల 18న విడుదల చేసిన 2,050 నర్సింగ్‌ ఆఫీ సర్‌ పోస్టులకు, ఈ 272 పోస్టులు అదనం అని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

దీంతో మొత్తం నర్సింగ్‌ ఖాళీల సంఖ్య 2,322కు పెరిగింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ మొదలవగా, అక్టోబర్ 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులకు చివరి గడువుగా పేర్కొంది. నవంబర్‌ 23న ఆన్‌లైన్‌లో (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) రాత పరీక్ష నిర్వహించనున్నారు. 

చదవండి: 600 Jobs: 600 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి.. పోస్టుల వివరాలు ఇలా..

మొత్తంగా 732 ఫార్మసిస్ట్‌ పోస్టులు: గత నెల 24న 633 ఫార్మసిస్ట్‌(గ్రేడ్‌ 2) పోస్టులకు మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇప్పటికే దరఖా స్తుల ప్రక్రియ మొదలైంది. ఇదే నోటిఫికేషన్‌కు అదనంగా మరో 99 పోస్టులను జత చేస్తున్నామని, మొత్తం పోస్టు ల సంఖ్య 732కు పెరిగిందని తెలుపుతూ శుక్రవారం బోర్డు ప్రకటించింది.

ఈ పోస్టులకు అక్టోబర్‌ 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఇచి్చంది. నవంబర్‌ 30న ఆన్‌లైన్‌లో రాత పరీక్ష నిర్వహించనున్నారు. జోన్లు, కేటగిరీలవారీగా ఖాళీల సం ఖ్యను బోర్డు వెబ్‌సైట్‌ https://mhsrb.telangana.gov. in/MHSRB/home.htm లో అందుబాటులో ఉంచారు. 

Published date : 15 Oct 2024 09:54AM

Photo Stories