Staff Nurse Jobs: 313 స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు
అందులో భాగంగా స్టాఫ్‌నర్సుల నియామకాలను చేపడుతోంది. జోన్–4 (రాయలసీమ జిల్లాలు) పరిధిలో ఇప్పటికే కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల నియామకాలు భారీగా జరిగాయి. మరోమారు అధిక సంఖ్యలో జరగనున్నాయి.
చదవండి: Skill Development and Training Department: జర్మనీలో నర్స్ ఉద్యోగాలకు 150 మంది ఎంపిక
మొత్తం 11,120 దరఖాస్తులు
2023 ప్రారంభం నుంచే ప్రభుత్వం పెద్దసంఖ్యలో స్టాఫ్ నర్సు నియామకాలను చేపట్టింది. ఇందుకు సంబంధించి అభ్యర్థుల నుంచి మొత్తం 11,120 దరఖాస్తులు వచ్చాయి. ఏప్రిల్ వరకు మొత్తం 286 మంది అర్హులకు స్టాఫ్ నర్సులుగా ఉద్యోగాలిచ్చింది.
చదవండి: జర్మనీలో నర్సులుగా ఉద్యోగావకాశాలు
తాజాగా 313 నియామకాలు
ప్రభుత్వం మరోమారు స్టాఫ్‌నర్సు నియామకాలను చేపడుతోంది. ఇప్పటికే వచ్చిన 11,120 దరఖాస్తుల నుంచి అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి.. రాయలసీమలోని 8 జిల్లాల్లో గల ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం 313 మంది స్టాఫ్‌నర్సులను నియమించనున్నారు. మెడికల్ అండ్ హెల్త్ రీజనల్ డైరెక్టర్ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు) పరిధిలో 90, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆధ్వర్యంలో నంద్యాల మెడికల్ కాలేజీ, తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రికి సంబంధించి 149, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్‌లో 74.. మొత్తం 313 నియామకాలను చేపడుతున్నారు.