Skip to main content

Skill Development and Training Department: జర్మనీలో నర్స్‌ ఉద్యోగాలకు 150 మంది ఎంపిక

సాక్షి, అమరావతి: జర్మనీలో ఉద్యోగం చేసేందుకు రాష్ట్రం నుంచి 150 మంది బీఎస్సీ నర్సింగ్‌ అభ్యర్థులు ఎంపికయ్యారని నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేశ్‌కుమార్‌ తెలిపారు.
Skill Development and Training Department
జర్మనీలో నర్స్‌ ఉద్యోగాలకు 150 మంది ఎంపిక

జూలై 6న కేఎల్‌ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జర్మనీలో ఉద్యోగాలకు ఎంపికైన 150 మందికి శిక్షణ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని తెలిపారు. అభ్యర్థులు కేవలం వీసా ప్రాసెసింగ్‌ ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. జర్మనీలో ఉద్యోగంలో చేరిన తర్వాత ప్రారంభ వేతనం కింద నెలకు 1,000 యూరోలు(సుమారు రూ.89,000) లభిస్తాయని చెప్పారు. జూలై 10 నుంచి టక్ట్‌ ఇంటర్నేషనల్, ఆక్సిలా అకాడమీ బృందం సంయుక్తంగా జర్మన్‌ భాషపై 2 నెలల పాటు శిక్షణ ఇస్తుందని తెలిపారు.

చదవండి: Jobs: మళ్లీ స్టాఫ్‌నర్స్‌ నియామకాలు

ఉపాధి మరియు శిక్షణ శాఖ డైరెక్టర్, ఐఏఎస్‌ అధికారిణి నవ్య మాట్లాడుతూ విదేశీ భాషల్లో ప్రావీణ్యం సాధించడం ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చన్నారు. టక్ట్‌ ఇంటర్నేషనల్‌ సీఈవో రాజ్‌సింగ్‌ మాట్లిడుతూ జూలై 10 నుంచి 150 మంది నర్సులకు జర్మన్‌ భాషలో శిక్షణ ఇస్తామన్నారు. తమకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి వల్లి అనే యువతి కృతజ్ఞతలు తెలిపింది. 

చదవండి: Central Government: స్టాఫ్‌ నర్స్‌.. ఇక నర్సింగ్‌ ఆఫీసర్‌

Published date : 07 Jul 2023 05:38PM

Photo Stories