Skip to main content

Jobs: వైద్యారోగ్యశాఖలో పెండింగ్‌లో ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు

సాక్షి, మహబూబాబాద్‌: వైద్యారోగ్యశాఖలో నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
Exercise to fill the pending posts in the medical department

మెరుగైన వైద్యం అందించేందుకు జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) ద్వారా కాంట్రాక్ట్‌ పద్ధతిలో 37 పోస్టుల భర్తీకి మార్చి నెలలో శ్రీకారం చుట్టగా ఈ పోస్టుల కోసం 1,657 మంది దరఖాస్తు చేసుకున్నారు.

అయితే అప్పుడే భర్తీకి ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సిద్ధం కాగా.. గతంలో భర్తీ చేసిన ఉద్యోగాల్లో అవకతవకలు జరిగినట్లు ప్రచారం జరిగింది. దీంతో కాస్త ఆలస్యం కావడం.. తర్వాత ఎన్నికలు, అధికారులు మార్పిడి మొదలైన కారణాలో ఆలస్యమైన భర్తీ ప్రక్రియకు ఎట్టకేలకు మోక్షం లభించింది.

చదవండి: 872 Jobs: కొత్త మెడికల్‌ కాలేజీలకు ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి అనుమతి

నాలుగు నెలల క్రితం నోటిఫికేషన్‌..

నాలుగు నెలల క్రితం నోటిఫికేషన్‌ ఇచ్చిన పోస్టులను భర్తీ చేసేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ముందుగా మెరిట్‌ జాబితాను తయారు చేసి.. అందులో అభ్యంతరాల ఉంటే చెప్పాలని కోరారు. జాబితాను జిల్లా వైద్యాధికారి కార్యాలయం నోటీస్‌ బోర్డుపై పెట్టారు.

పొరపాట్లను సరిదిద్దుడం, గతంలో సబ్మిట్‌ చేయని సర్టిఫికెట్లను సబ్మిట్‌ చేయడం కోసం ఇచ్చిన గడువు ముగిసింది. కాగా అన్ని పరిశీలించిన తర్వాత మరో జాబితా ప్రకటించి రోస్టర్‌ విధానంతో ఉద్యోగుల ఎంపిక వివరాలను వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు.

చదవండి: HIV Medicine Test : హెచ్ఐవీకి సూది మందుకు ప‌రీక్ష విజ‌య‌వంతం..

సర్టిఫికెట్లకు ఆన్‌లైన్‌ కష్టాలు..

ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు ఉన్నా.. పలు సర్టిఫికెట్లు సకాలంలో అందుబాటులో లేక పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌, ఇతర మెడికల్‌ బోర్డు పరిధిలోని కళాశాలల్లో చదివిన విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన తర్వాత హైదరాబాద్‌లోని మెడికల్‌ బోర్డు వద్ద సర్టిఫికెట్‌ను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. తర్వాత సర్టిఫికెట్‌పై పేర్కొన్న విధంగా ఎప్పటికప్పుడు రెన్యూవల్‌ చేయించుకోవాలి.
ఒకవేళ హైదరాబాద్‌ వరకు వెళ్లకుండా స్థానికంగా ఆన్‌లైన్‌ ద్వారా కూడా రిజిస్ట్రేషన్‌, రెన్యూవల్‌ చేయించుకునే అవకాశం కల్పించారు. ఈక్రమంలో కొందరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే నాలుగు నెలలు గడిచినా ఇప్పటి వరకు కొందరి సర్టిఫికెట్లు రిజిస్ట్రేషన్‌, రెన్యూవల్‌ కాలేదు. మెరిట్‌ జాబితాలో సదరు సర్టిఫికెట్లు పెండింగ్‌ అని పేర్కొన్నారు.
జాబితాలో మెరిట్‌లో ఉండి సర్టిఫికెట్‌ పెండింగ్‌ ఉండడంతో దరఖాస్తులు రిజెక్ట్‌ అవుతాయని అధికారులు చెబుతున్నారు. దీంతో తీరా ఉద్యోగం వచ్చే సమయానికి సర్టిఫికెట్‌ లేకుండా పోతుందని ఆందోన చెందిన కొందరు అభ్యర్థులు ఆన్‌లైన్‌ సెంటర్లు, హైదరాబాద్‌ మెడికల్‌ బోర్డు వద్దకు పరుగులు పెట్టారు.
అక్కడ కూడా సకాలంలో ఆన్‌లైన్‌ కాకపోకోవడం, అధికారులు చూసి అప్రూవల్‌ చేయడానికి సమయం పట్టడంతో ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదు. కాగా సర్టిఫికెట్‌ తెచ్చుకోవడంతో పాటు అభ్యంతరాల స్వీకరణకు గడువు ఇవ్వాలని కోరుతున్నారు.
 

Published date : 19 Jul 2024 04:05PM

Photo Stories