Central Government: స్టాఫ్ నర్స్.. ఇక నర్సింగ్ ఆఫీసర్
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎయిమ్స్, ఈఎస్‌ఐ, రైల్వే ఆసుపత్రులు సహా ఇతర ఆసుపత్రుల్లో కొత్త హోదాను అమలు చేస్తోంది. దీన్ని కొన్ని రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయి. ఆ ప్రకారం తెలంగాణలోనూ నర్సింగ్ పోస్టుల్లో ఉన్న వారికి కొత్త హోదాలు ఇవ్వాలని నర్సులు కోరుతున్నారు. హోదాను మార్చడం వల్ల సమాజంలో గౌరవం ఏర్పడుతుందన్న ఉద్దేశంతో కేంద్రం వీటిని తెచ్చింది. హోదాను మార్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థికపరమైన భారం ఏమీ ఉండదంటున్నారు.
చదవండి: Medical Faculty: వైద్య అధ్యాపకుల బదిలీల్లో వివక్ష
బీఎస్సీ నాలుగేళ్లు, ఎంఎస్సీ రెండేళ్లు, పీహెచ్‌డీ ఏళ్లు చదివినా కూడా ప్రాథమికంగా స్టాఫ్ నర్సు పోస్టే ఉంటుంది. దీనివల్ల ఉన్నతస్థాయిలోని నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన వారు సరైన గౌరవం పొందలేకపోతున్నారని చెబుతున్నారు. ఆసుపత్రుల్లో అనేక విధానపరమైన నిర్ణయాల్లో డాక్టర్లు భాగస్వాములుగా ఉంటున్నారని, అధిపతులుగా కూడా వారే ఉంటున్నారన్న విమర్శలున్నాయి. ఇలా నర్సులపై వివక్ష కొనసాగుతోందన్న ఆందోళన ఉంది. పైగా నర్సింగ్ డైరెక్టరేట్ లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు నర్సులు చెబుతున్నారు.
చదవండి: Tele MANAS: 14416కు విస్తృత ప్రచారం కల్పించాలి
కేంద్ర ప్రభుత్వం మార్చిన హోదాలు ఇలా...
ప్రస్తుత హోదా |
కొత్త హోదా |
స్టాఫ్ నర్స్ |
నర్సింగ్ ఆఫీసర్ |
నర్సింగ్ సిస్టర్ |
సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ |
సీనియర్ ట్యూటర్ |
అసిస్టెంట్ ప్రొఫెసర్ |
లెక్చరర్ |
అసోసియేట్ ప్రొఫెసర్ |
ప్రిన్సిపాల్ |
ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపాల్ |
వైస్ ప్రిన్సిపాల్ |
ప్రొఫెసర్ కమ్ వైస్ ప్రిన్సిపాల్ |
నర్సింగ్ దినోత్సవం రోజున ప్రకటించాలి
ఈ నెల 12న నర్సింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం నర్సుల హోదాను మార్చాలి. తద్వారా సమాజంలో వారి గౌరవ మర్యాదలు పెంచాలి. హోదాలు మార్చడం వల్ల ప్రభుత్వంపై ఆర్థికంగా ఎటువంటి భారం పడదు. కొత్త హోదాలను ప్రభుత్వం అమలు చేస్తే, ప్రైవేట్ ఆసుపత్రులూ అనుసరిస్తాయి. అంతేగాక రాష్ట్రంలో నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు చేసి, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్‌ను దానికి డైరెక్టర్‌గా నియమించాలి.
– డాక్టర్ రాజేశ్వరి, అధ్యక్షురాలు, ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా