Tele MANAS: 14416కు విస్తృత ప్రచారం కల్పించాలి
ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 14416 టోల్‌ఫ్రీ నంబర్ మీడియా మరింత ప్రాధాన్యమిచ్చి.. ప్రచారం చేయాలని కోరారు. ఫలితంగా బలవన్మరణాలు నిరోధించవచ్చన్నారు. ‘ఆత్మహత్యలపై వార్తా కథనాలు–ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలు, ఆత్మహత్యలు నిరోధించడంలో మీడియా పాత్ర’ అనే అంశాలపై మే 4న జూమ్‌లో సమావేశం నిర్వహించారు.
చదవండి: పాఠశాలలు ప్రారంభించకపోతే.. పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తే అవకాశం..
డాక్టర్ మానస మాట్లాడుతూ ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలు, మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు టోల్‌ఫ్రీ నంబర్ 14416ను సంప్రదించవచ్చన్నారు. వైద్య నిపుణులు పరిష్కార మార్గాన్ని సూచిస్తారని పేర్కొన్నారు. బెంగళూరు ‘నిమ్‌హాన్స్’ యూనివర్సిటీ ప్రొఫెసర్లు అనీష్ చెరియన్, ఆర్య తిరుమేని మాట్లాడుతూ ఆత్మహత్యల వార్తలను ప్రముఖంగా ప్రచురించవద్దని మీడియాను కోరారు. లేకపోతే అప్పటికే మానసికంగా ఒత్తిడికి గురైనవారు ఆత్మహత్యలకు ప్రయత్నించే అవకాశముందన్నారు.
చదవండి: Admissions: ‘ప్రైవేట్’లో ఉచిత విద్యకు ఇంత మందికి అవకాశం