విద్యార్థుల మానసిక వికాసానికి ‘గైడ్‌కాస్ట్’
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: నలభై అయిదేళ్ల సుదీర్ఘ విద్యాప్రస్థానంలో లక్షలాది మంది విద్యార్థుల కలలను సాకారం చేసిన నారాయణ విద్యాసంస్థలు.. ఇప్పుడు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాయని ఆ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్ పి.సింధూర నారాయణ, శరణి నారాయణ ఓ ప్రకటనలో తెలిపారు.
తల్లిదండ్రులు పిల్లలతో ఎలా నడుచుకోవాలి? వారి మానసిక ఆరోగాన్ని ఎలా కాపాడాలి? అనే అంశాలపై నిపుణులతో చర్చించి అవసరమైన సలహాలు, సూచనలతో.. యూట్యూబ్ వేదికగా మొదటి సీజన్‌లో మొదటి ఎపిసోడ్‌ను ‘గైడ్‌కాస్ట్’పేరుతో విడుదల చేసినట్టు వెల్లడించారు. ఇందులో విద్యార్థుల మానసిక స్థితి, దానిపై ప్రభావం చూపే అంశాలను లోతుగా చర్చించారని తెలిపారు.
చదవండి:
Government School Teachers: టీచర్లకు నేటి నుంచి టీచ్ టూల్ అబ్జర్వేషన్‌పై శిక్షణ
Free Education: నిరుపేద దేశంలో ఉచిత విద్య.. ఈడ్చి కొడుతున్న ఈదురుగాలులు.. ఎక్కడంటే..
Published date : 19 Jul 2024 03:44PM