Staff Nurse Counselling: స్టాఫ్ నర్స్ నియామక కౌన్సెలింగ్ ప్రారంభం
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : కడప వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 పరిధిలో శుక్రవారం స్ధానిక నూర్జాహన్ ఫంక్షన్ హల్‌లో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్‌ల నియామక కౌన్సెలింగ్ జరిగింది. గత అనుభవాల దృష్ట్యా అభ్యర్థుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించారు.
మొత్తం 313 పోస్టుల భర్తీకి గాను మొదటి రోజు 177 మందికి కౌ న్సెలింగ్ నిర్వహించి నియామక పత్రాలను అందజేశారు. మిగిలిన అభ్యర్ధులకు శనివారం కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ ప్రభు త్వం వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలు చేప డుతోందన్నారు.
IT Hub in AP: ఐటీ హబ్‌గా విశాఖ అభివృద్ధి
స్టాఫ్ నర్స్‌లుగా నియమితులైన వారు వైద్య సేవల ను అందించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్ భక్తవత్సలం, సూపరిండెంట్‌లు గోపాల్‌రెడ్డి, వెంకటసుబ్బమ్మ సీనియర్ అసిస్టెంట్స్ అల్తావుల్లా, వినీష రాయలసీమ జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్ధులు పాల్గొన్నారు.
Published date : 22 Jul 2023 05:41PM