Skip to main content

Staff Nurse Counselling : స్టాఫ్ న‌ర్స్‌ల కౌన్సెలింగ్ నిలిపివేతపై అభ్య‌ర్థుల ఆందోళ‌న‌..!

స్టాఫ్‌నర్స్‌ నియామకాలకు కౌన్సిలింగ్‌ ప్రక్రియ నిలిపివేసింది ప్రభుత్వం..
Employees concern over suspension of counseling of staff nurses

కడప: కడప వైద్య ఆరోగ్య శాఖ జోన్‌–4 (రాయలసీమ జిలాలు) పరిధిలో 2023, నవంబరులో స్టాఫ్‌నర్స్‌ నియామకాలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. పది వేలకు పైగా దరఖాస్తులు రాగా, నిబంధనలు, మెరిట్‌ ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక జాబితా తయారుచేసి విడతల వారీగా కౌన్సిలింగ్‌ నిర్వహించారు. అర్హులైన వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం ద్వారా ఇప్పటికే నిరుద్యోగులు కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సులుగా నియమితులయ్యారు.

FREE Coaching for Group 1: గ్రూప్‌ 1 మెయిన్స్‌కు శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఒక్కో విడతలో వంద మంది చొప్పున నాలుగు విడతలుగా నియామక కౌన్సెలింగ్‌ చేపట్టారు. ఐదో విడతగా మదనపల్లి, పులివెందుల, ఆదోని మెడికల్‌ కాలేజీల్లో 206 స్టాఫ్‌నర్స్‌ పోస్టుల భర్తీ చేపట్టాల్సి ఉంది. ఎన్నికల కోడ్‌ రావడంతో ఆటంకం ఏర్పడింది. ఎన్నికలు ముగిసిన అనంతరం ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం నియామక కౌన్సిలింగ్‌ ప్రక్రియ నిలిపివేసింది.

Anganwadis: అంగన్‌వాడీల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి

అనుమతుల నిలుపుదలతో సందిగ్ధం

నాలుగు విడతలు పూర్తవగా ఐదో విడత రిక్రూట్‌మెంట్‌ కౌన్సెలింగ్‌పై సందిగ్ధత కొనసాగుతోంది. స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల కౌన్సెలింగ్‌ నిలుపుదల ఆందోళన కలిగిస్తోంది. ఎంపికైన అభ్యర్ధులు కౌన్సెలింగ్‌ ఎప్పుడు జరుగుతుందంటూ వాకబు చేస్తున్నారు. మదనపల్లె మెడికల్‌ కాలేజీకి అనుమతులు రద్దు కావడంతో పులివెందుల, ఆదోని, మదనపల్లె మెడికల్‌ కాలేజీలో స్టాఫ్‌నర్స్‌ల నియామకంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత రిక్రూట్‌మెంట్‌ రద్దుచేసి కొత్త నోటిఫికేషన్‌ ఇస్తే తమ పరిస్ధితి ఏమిటనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వైద్య,ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు రెండువారాల పాటు ఎలాంటి నియామకాలు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఆ గడువు ముగిసిన తర్వాత అభ్యర్థుల అనుమానాలకు అడ్డుకట్ట పడనుంది.

గత ఐదేళ్లలో ప్రజారోగ్యమే లక్ష్యంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్టాఫ్‌నర్స్‌ నియామకం చేపట్టింది. నాలుగు విడతలు పూర్తిచేసి ఐదో విడత నియామకాలు చేపట్టాల్సి ఉండగా టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు నిలుపుదల చేయడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఎంపికై న అభ్యర్థుల జాబితా ప్రకారమే నియామకాలు చేపడతారా? లేక కొత్తగా నోటిఫికేషన్‌ విడుదల చేస్తారా..? అనే సందేహలు వారిని మానసిక వేదనకు గురిచేస్తున్నాయి.

Job Mela : రేపు జాబ్ మేళా.. ఈ విద్య పొందిన‌వారు అర్హులు..!

Published date : 12 Jul 2024 09:50AM

Photo Stories