Skip to main content

Self Employment: ఈ కోర్సులను పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు

కోర్సుల ఆధారంగా అందుకు సంబంధించిన ఉద్యోగం, లేదా స్వయం ఉపాధి లభిస్తుంది..
Self Employment Opportunity for Medical Students after courses

సాక్షి ఎడ్యుకేషన్: 

  •     బీపీటీ, బీఓటీ, బీపీఓ, బీఏఎస్‌ఎల్‌పీ కోర్సులు పూర్తి చేసుకున్నవారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఫిజియోథెరపీ ఉత్తీర్ణులు ఆస్పత్రులు, రిహాబిలిటేషన్‌ సెంటర్లలో, స్పోర్ట్‌ క్లబ్స్‌లో ఫిజియోథెరపిస్ట్‌గా కొలువు దక్కించుకోవచ్చు. అదే విధంగా వారు సొంతంగా క్లినిక్స్‌ను ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. 
  •     ఆక్యుపేషనల్‌ థెరపీలో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసిన వారు ఆస్పత్రులు, రిహాబిలిటేషన్‌ సెంటర్లు, మానసిక చికిత్స కేంద్రాలు, విద్యా సంస్థలు, లెప్రసీ రిహాబిలిటేషన్‌ సెంటర్లలో ఉపాధి సొంతం చేసుకోవచ్చు. వీరికి థెరపిస్ట్, కన్సల్టెంట్‌ కొలువులు లభిస్తున్నాయి.
  •     ప్రోస్థెటిక్స్‌ అండ్‌ ఆర్థోటిక్స్‌ ఉత్తీర్ణులు ట్రామా కేర్‌ సెంటర్లు, కృత్రిమ అవయవాల ఉత్పత్తి సంస్థలు, ఆస్పత్రులు, రిహాబిలిటేషన్‌ సెంటర్లలో ఉద్యోగాలు సాధించొచ్చు. అదే విధంగా స్వయం ఉపాధి అవకాశాలు పొందొచ్చు. 
  •     బ్యాచిలర్‌ ఇన్‌ ఆడియాలజీ అండ్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజీ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి.. స్వచ్ఛంద సంస్థలు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూల్స్, రిహాబిలిటేషన్‌ సెంటర్లలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

Posts at TMC: టీఎంసీలో ఈ పోస్టులకు దరఖాస్తులు..

సేవా దృక్పథం ఉంటేనే
జాబ్‌ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ కోర్సుల్లో చేరడం సరికాదని, అభ్యర్థులకు స్వతహాగా సేవా దృక్పథం ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ కోర్సుల ద్వారా లభించే కొలువులన్నీ ఇతరులకు సహానుభూతితో సేవలు అందించేవిధంగా ఉంటాయని పేర్కొంటున్నారు. ముఖ్యంగా దివ్యాంగులకు సేవ చేసే క్రమంలో పూర్తి సేవా దృక్పథం అవసరమంటున్నారు.ఇలాంటి దృక్పథం ఉన్న వారే ఈ కోర్సులను ఎంచుకుంటే భవిష్యత్తులో మెరుగ్గా రాణించగలరని నిపుణుల అభిప్రాయం. 

World Largest Airport: ప్రపంచంలోనే అతి పెద్ద విమానాశ్రయం నిర్మాణం.. దీని పేరు ఏమంటే..

Published date : 29 Apr 2024 01:13PM

Photo Stories