Anganwadi Admissions: అంగన్‌వాడీల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి.. ఈ పదార్థాలను వాడకూడదు
Sakshi Education
సంగారెడ్డి టౌన్ : అంగన్‌వాడీల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి లలిత కుమారి అధికారులను ఆదేశించారు.
జూలై 15 నుంచి వారం రోజులపాటు అమ్మ మాట అంగన్‌వాడీ బాట కార్యక్రమాన్ని చేపట్టాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
చదవండి: Lakshmapuram ZP School: 8 మంది టీచర్లు.. 10 మంది విద్యార్థులు
జిల్లాలోని కేంద్రాల్లో నాణ్యత లేని పదార్థాలను వాడకూడదన్నారు. గర్భిణులకు, బాలింతలకు రక్తహీనత సమస్య తలెత్తకుండా సరైన పోషకాహారం అందించేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రాథమిక విద్యపై దృష్టి సారించాలన్నారు. నాణ్యమైన విద్యబోధన అందజేయాలన్నారు. కేంద్రాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, అప్పుడే పిల్లల దరికి వ్యాధులు చేరవన్నారు. కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Published date : 13 Jul 2024 05:22PM