Jobs: స్టాఫ్ నర్సుల భర్తీకి రెండో విడత కౌన్సెలింగ్‌కు సన్నాహాలు
విజయనగరం మెడికల్ కళాశాలలో 80 పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో ఆరు పోస్టుల భర్తీకి నవంబర్ 7న కౌన్సెలింగ్ నిర్వహించి.. 60 మందికి పోస్టింగ్ ఇచ్చారు. ఏడు పోస్టుల్లో కోవిడ్ వెయిటేజ్ మార్కుల స్పష్టత కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు రీజినల్ డైరెక్టర్ డాక్టర్ బి.సుజాత లేఖ రాశారు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా.. తుది జాబితాలో ఎంపికై న 11 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కాలేదు.
చదవండి: Medical Health Department: వెబ్‌సైట్‌లో స్టాఫ్ నర్సుఉద్యోగాల మెరిట్ లిస్టు
ఐదుగురు పోస్టింగ్ వద్దని లేఖ ఇచ్చినట్లు ఆర్డీ డాక్టర్ సుజాత తెలిపారు. పోస్టింగ్ ఇచ్చిన 60 మందిలో ఎంత మంది విధుల్లో చేరుతారో తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఖాళీలన్నీ క్రోడీకరించి రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.