Skip to main content

Placement Drive: గురుకులంలో ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌

సారంగపూర్‌: మండలంలోని చించోలి(బీ) గ్రామ సమీపంలోని మైనార్టీ గురుకుల బాలుర పాఠశాల, కళాశాలలో ఎంఎస్‌ఎన్‌ ల్యాబోరేటరీస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ప్రతినిధులు మార్చి 24న‌ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించారు.
Placement Drive

జిల్లాలోని వివిధ కళాశాలల్లో ఇటీవలే ఎంపీసీ, బైపీసీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన 35మంది విద్యార్థులు హాజరయ్యారు. కంపెనీ ప్రతినిధులు 35మందికి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికైన ఆరుగురికి ఉద్యోగ నియామకపత్రాలు అందజేశారు.

చదవండి: TREI-RB: గురుకుల బోర్డుకు కొత్త సారథులు!

ఇందులో నిర్మల్‌ మైనార్టీ గురుకులం నుంచి షో యబ్‌ అక్తర్‌ ఎంపికై నట్లు ఉమ్మడి జిల్లా గురుకులాల సమన్వయ కర్త శ్రీధర్‌ తెలిపారు. ఎంపికైన విద్యార్థులను కంపెనీ ప్రతినిధులు, గురుకుల సిబ్బంది అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ మహ్మద్‌ ఫిరోజ్‌, జిల్లా అకాడమిక్‌ కోఆర్డినేటర్‌ హమీద్‌, సిబ్బంది ఉన్నారు.

చదవండి: Gurukul Teacher Jobs: భర్తీ ఎన్ని? మిగిలినవి ఎన్ని?

Published date : 25 Mar 2024 04:10PM

Photo Stories