Transfers: వైద్య, ఆరోగ్యశాఖలో బదిలీలకు మార్గదర్శకాలు
అభ్యర్థన పూర్వక (వన్ రిక్వెస్ట్), పరిపాలన సౌలభ్యం కోసం మాత్రమే బదిలీలకు అనుమతిస్తారు. ఒకేచోట 2023 ఏప్రిల్ 30 నాటికి కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తిచేసిన వాళ్లు మాత్రమే రిక్వెస్ట్ బదిలీలకు అర్హులు. ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారిని సీనియార్టీ ప్రాతిపదికన బదిలీ చేస్తారు. క్యాడర్ స్ట్రెంత్‌లో 30 శాతానికి మించకుండా బదిలీలకు అనుమతిస్తారు. ఎంపీహెచ్‌ఏ (ఎఫ్), ఏఎన్‌ఎంలకు మాత్రం ఇటీవల జారీచేసిన జీవో నం.6 ప్రకారమే పరస్పర బదిలీలకు అనుమతిస్తారు.
చదవండి: Medical Health Department: 1,061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
40 శాతం వైకల్యం కలిగిన వారితోపాటు అంధులు, మానసిక వికలాంగులు, భార్యాభర్తలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు, కారుణ్య నియామకం కింద నియమితులైన వితంతువులకు ఈ సాధారణ బదిలీల్లో తొలి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో కనీసం రెండేళ్లు పనిచేసినవారికి ప్రాధాన్యతనిస్తారు. ఈ బదిలీల్లో నోటిఫైడ్ ఏజెన్సీ ప్రాంతాల్లో పేర్కొన్న ఖాళీల భర్తీకి తొలుత ప్రాధాన్యత ఇస్తారు. ఏపీ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు ప్రత్యేక గైడ్‌లైన్స్ జారీచేయనున్నారు. జూన్ 24వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.