Medical Health Department: 1,061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను వైద్య ఆరోగ్యశాఖ భర్తీ చేసింది.
ఈ మేరకు వారందరికీ నియామకాలను ఖరారు చేస్తూ మే 24న ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీ జోన్–1, మల్టీ జోన్–2లో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో భర్తీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చేపట్టింది.
చదవండి: Medical Department: ఆ పోస్టులకు ఏజ్ భారమైంది!
జాబితా విడుదల అనంతరం ఖాళీల వారీగా పోస్టులను భర్తీ చేసి ఆయా కళాశాలలకు కేటాయించింది. 1,442 పోస్టులకు 1,061 మందికే పోస్టింగ్‌లు ఇచ్చా రు. పరిశీలనలో మిగిలిన అభ్యర్థులు అర్హత సాధించలేదని వైద్య వర్గాలు వెల్లడించాయి.
చదవండి: MBBS Seats: విద్యార్థులకు గుడ్ న్యూస్... ప్రతి నలుగురిలో ఒకరికి ఎంబీబీఎస్ సీటు
Published date : 25 May 2023 01:07PM