2, 225 Jobs: పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి.. పోస్టులు ఇలా..
ఇప్పటికే 9,096 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులివ్వగా... వీటి భర్తీకి సంబంధించిన ఏర్పాట్లను గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) పూర్తి చేసింది. తాజాగా మరో 2,225 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులిచ్చింది. ఈమేరకు తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జనవరి 27న ఉత్తర్వులు జారీ చేశారు.
చదవండి: LIC ADO Recruitment 2023: ఎల్‌ఐసీలో 9394 ఏడీవో పోస్టులు
ఇందులో బీసీ గురుకుల పాఠశాలలకు సంబంధించి 2,132 పోస్టులకుగాను ఐదు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేయగా... జనరల్ గురుకులాల పరిధిలో 93 ఉద్యోగాలకు మరో జీఓ జారీచేశారు. అలాగే, సమాచార, పౌరసంబంధాల శాఖ పరిధిలో 166 పోస్టుల భర్తీకి మరో జీవోను ఆర్థిక శాఖ జారీ చేసింది. గురుకులాల్లో బోధన పోస్టుల భర్తీ బాధ్యతలు టీఆర్‌ఈఐఆర్‌బీకి, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీని టీఎస్‌పీఎస్సీకి, స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీని టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీకి అప్పగించింది.
తాజాగా అనుమతులిచ్చిన పోస్టులు, నియామక సంస్థలు ఇలా...
కేటగిరీ |
పోస్టులు |
నియామక సంస్థ |
బీసీ గురుకుల సొసైటీలో |
||
స్టాఫ్ నర్స్ |
63 |
టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ |
ప్రిన్స్‌పల్(సూ్కల్) |
10 |
టీఆర్‌ఈఐఆర్‌బీ |
డిగ్రీ లెక్చరర్ |
480 |
టీఆర్‌ఈఐఆర్‌బీ |
జూనియర్ లెక్చరర్ |
185 |
టీఆర్‌ఈఐఆర్‌బీ |
పీజీటీ |
235 |
టీఆర్‌ఈఐఆర్‌బీ |
టీజీటీ |
324 |
టీఆర్‌ఈఐఆర్‌బీ |
లైబ్రేరియన్ |
11 |
టీఆర్‌ఈఐఆర్‌బీ |
లైబ్రేరియన్ (డిగ్రీ) |
37 |
టీఆర్‌ఈఐఆర్‌బీ |
లైబ్రేరియన్ (స్కూల్) |
11 |
టీఆర్‌ఈఐఆర్‌బీ |
ఫిజికల్‌డైరెక్టర్ (డిగ్రీ) |
20 |
టీఆర్‌ఈఐఆర్‌బీ |
పీఈటీ(సూ్కల్స్) |
33 |
టీఆర్‌ఈఐఆర్‌బీ |
ఆర్ట్/క్రాఫ్ట్/మ్యూజిక్ |
33 |
టీఆర్‌ఈఐఆర్‌బీ |
అసిస్టెంట్ లైబ్రేరియన్ (డిగ్రీ) |
15 |
టీఆర్‌ఈఐఆర్‌బీ |
ల్యాబ్ అసిస్టెంట్ |
60 |
టీఆర్‌ఈఐఆర్‌బీ |
కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ |
30 |
టీఆర్‌ఈఐఆర్‌బీ |
స్టోర్ కీపర్ |
15 |
టీఆర్‌ఈఐఆర్‌బీ |
జూనియర్ లెక్చరర్ |
417 |
టీఆర్‌ఈఐఆర్‌బీ |
జూనియర్ అసిస్టెంట్ |
141 |
టీఎస్‌పీఎస్సీ |
జూనియర్ అసిస్టెంట్ (హెచ్‌ఓ) |
12 |
టీఎస్‌పీఎస్సీ |
జనరల్ గురుకుల సొసైటీలో |
||
టీజీటీ |
87 |
టీఆర్‌ఈఐఆర్‌బీ |
ఆర్ట్/క్రాఫ్ట్/ మ్యూజిక్ |
06 |
టీఆర్‌ఈఐఆర్‌బీ |
సమాచార పౌరసంబంధాల శాఖలో |
||
అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ |
41 |
టీఎస్‌పీఎస్సీ |
అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ |
16 |
టీఎస్‌పీఎస్సీ |
ఎడిటర్ (ఉర్దూ) |
01 |
టీఎస్‌పీఎస్సీ |
ఇన్ఫర్మేషన్ టెక్నీషియన్ |
22 |
టీఎస్‌పీఎస్సీ |
పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ |
04 |
టీఎస్‌పీఎస్సీ |
పబ్లిసిటీ అసిస్టెంట్ |
82 |
టీఎస్‌పీఎస్సీ |