Jobs: గురుకుల అభ్యర్థులకు ఈ తేదీ వరకు ఆప్షన్ అవకాశం
Sakshi Education
![Jobs](/sites/default/files/images/2024/06/12/distance-online-learning-1657958357-1718188087.jpg)
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సొసైటీ ఎంపిక, జోనల్ ఎంపిక ఆప్షన్లు ఇచ్చేందుకు అక్టోబర్ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయవచ్చని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు కన్వీనర్ మల్లయ్య భట్టు అక్టోబర్ 9న ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసు కున్న అభ్యర్థులంతా సొసైటీ ప్రాధాన్యతలు, జోనల్ ప్రాధాన్యతలు తప్పకుండా ఎంట్రీ చేయాలని సూచించారు.
చదవండి:
చదువు మాని.. చపాతీల తయారీ.. గురుకులంలో విద్యార్థుల వంటావార్పు
Published date : 10 Oct 2023 12:38PM