Skip to main content

చదువు మాని.. చపాతీల తయారీ.. గురుకులంలో విద్యార్థుల వంటావార్పు

చేర్యాల(సిద్దిపేట): వసతి గృహంలో హాయిగా చదువుకోవలసిన విద్యార్థులు వంట పనివారిగా మారి చపాతీలు తయారు చేస్తున్నారు.
 students cooking in gurukulam
చదువు మాని.. చపాతీల తయారీ.. గురుకులంలో విద్యార్థుల వంటావార్పు

సిద్దిపేట జిల్లా చేర్యాలలోని గురుకుల పాఠశాలలో అక్టోబ‌ర్ 1న‌ జరిగిన ఈ సంఘటన వివరాలివి. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అక్టోబ‌ర్ 1న‌ ఉదయం అల్పాహారంలో చపాతీలు అందించాల్సి ఉంటుంది. కానీ వాటి తయారీకి సరిపడా మనుషులు లేకపోవడంతో విద్యార్థులతో చేయించారు.

చదవండి: Dinesh: చిచ్చరపిడుగు.. పది లక్షల మందిలో ప్రథముడు

ప్రిన్సిపాల్‌ సహకారంతోనే కాంట్రాక్టర్‌ ఇలా పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని గురుకుల ప్రిన్సిపాల్‌ అశోక్‌బాబు వద్ద ప్రస్తావించగా.. తమకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి ఉందని స్పష్టం చేశారు. అందువల్లే విద్యార్థులతో వంట పని చేయిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Published date : 02 Oct 2023 03:46PM

Photo Stories