సాక్షి, అమరావతి: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో టీచర్ పోస్టుల భర్తీకి జూన్ 23 నుంచి 25వ తేదీ వరకు జిల్లాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
టీచర్ పోస్టులకు ఇంటర్వ్యూలు
రాష్ట్రంలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న 1,543 పోస్టుల భర్తీకి సమగ్ర శిక్ష ఇటీవల నోటిఫికేషన్ ఇవ్వగా, 46,173 దరఖాస్తులు అందాయి. పోస్టుకు ముగ్గురి చొప్పున అర్హత, ప్రతిభ కలిగిన అభ్యర్థులను 4,243 మందిని ఎంపిక చేసి, వారి వివరాలను జిల్లాలకు పంపించారు. జూన్ 21, 22న అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి, జూన్ 23 నుంచి డీఈవో, జాయింట్ కలెక్టర్, సబ్జెక్ట్ నిపుణులతో పాటు ఐదుగురి సభ్యులు బృందం అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి, తుది జాబితా సిద్ధం చేస్తుందని సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు.