Skip to main content

KGBV: అభ్యర్థన బదిలీలకు షెడ్యూల్‌ విడుదల

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తోన్న బోధన, బోధనేతర సిబ్బంది బదిలీలకు షెడ్యూల్‌ విడుదలైంది.
KGBV
అభ్యర్థన బదిలీలకు షెడ్యూల్‌ విడుదల

ఉద్యోగుల అభ్యర్థనపై చేపడుతున్న బదిలీల్లో జూన్‌ 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాల అడిషనల్‌ ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌ కార్యాలయాల్లో సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు చేసుకునేందుకు గడువిచ్చారు. 12న కలెక్టర్ల ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ ద్వారా అభ్యర్థన బదిలీలను చేపట్టనున్నారు. జిల్లాల కార్యాలయాల­కు పంపిన దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని కేజీబీవీ సెక్రటరీ మధుసూదనరావు జూన్‌ 2న తెలిపారు. 

చదవండి:

1, 358 Jobs: KGBV అన్ని పోస్టులకు ఒకే దరఖాస్తు

KGBV: 1,358 పోస్టుల భర్తీకి చర్యలు.. అర్హతలు, ఎంపిక విధానం ఇలా..

ఈ స్పెషల్‌ ఆఫీసర్లకు మోడల్‌ స్కూల్‌ హాస్టళ్ల బాధ్యతలు

Published date : 03 Jun 2023 03:43PM

Photo Stories