Skip to main content

KGBV: 1,358 పోస్టుల భర్తీకి చర్యలు.. అర్హతలు, ఎంపిక విధానం ఇలా..

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి సమగ్ర శిక్షా సొసైటీ చర్యలు చేపట్టింది.
KGBV
1,358 పోస్టుల భర్తీకి చర్యలు.. అర్హతలు, ఎంపిక విధానం ఇలా..

మొత్తం 1,358 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో మహిళా అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు. ఇందులో అత్యధికంగా పోస్ట్రుగాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ) పోస్టులు 846, కాంట్రాక్టు రెసిడెన్స్‌ టీచర్స్‌ (సీఆర్టీ) పోస్టులు 374 ఉన్నాయి. అలాగే 92 ప్రిన్సిపాల్, 46 పీఈటీ పోస్టులను కూడా భర్తీ చేస్తారు. ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్లు ప్రాతిపదికన  ఎంపిక ఉంటుందని సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ శ్రీనివాసులు తెలిపారు. ఈ పోస్టులకు వయోపరిమితి ఓసీలకు 18–42 ఏళ్లుగా నిర్ణయించారు. బీసీలు, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.   

చదవండి: ఈ స్పెషల్‌ ఆఫీసర్లకు మోడల్‌ స్కూల్‌ హాస్టళ్ల బాధ్యతలు

అర్హతలు, ఎంపిక విధానం.. 

ప్రిన్సిపాల్స్, పీజీటీ పోస్టులకు ఆయా సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. సీఆర్టీ పోస్టులకు ఆయా సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఈడీ తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థుల ఎంపికకు 100 మార్కులు కేటాయించారు. ఇప్పటికే కేజీబీవీల్లో పనిచేస్తున్న టీచింగ్‌ సిబ్బందికి 8 గ్రేస్‌ మార్కులు ఉంటాయి. స్కిల్‌ టెస్టుకు 15 మార్కులు కేటాయించారు. మిగిలిన మార్కులు అభ్యర్థి అకడమిక్‌ ప్రతిభకు నిర్దేశించారు. ఆసక్తి, అర్హత ఉన్న మహిళా అభ్యర్థులు మే 30 నుంచి జూన్‌ 5 వరకు  ్చpజుజbఠి.్చpఛిజటట.జీn ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుం రూ.100 చెల్లించాలి. జూన్‌ 14 నాటికి మొత్తం భర్తీ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు కేజీబీవీ కార్యదర్శి మధుసూదనరావు తెలిపారు. జేసీలు చైర్మన్లుగా ఉన్న అధికారుల బృందం ఆధ్వర్యంలో అభ్యర్థులను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారని వెల్లడించారు.   

చదవండి: 292 కొత్త జూనియర్‌ కాలేజీల్లో సిబ్బంది నియామకం

కేజీబీవీ సిబ్బందికి సాధారణ సెలవుల పెంపు

కేజీబీవీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ మహిళా సిబ్బందికి సాధారణ సెలవులను పెంచుతూ సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. గతంలో వీరికి ఏడాదికి 15 రోజులు సాధారణ సెలవులు ఉండేవి. అయితే, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ మహిళా సిబ్బంది విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ సిబ్బందితో సమానంగా మరో ఐదు సాధారణ సెలవులను పెంచుతూ ఉత్తర్వులిచ్చారు.
చదవండి: Education: బాలికల విద్యకు భరోసా

Published date : 30 May 2023 03:02PM

Photo Stories