292 కొత్త జూనియర్ కాలేజీల్లో సిబ్బంది నియామకం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు, కస్తూర్బా బాలికా విద్యాలయాలు లేని 292 మండలాల్లోని హైస్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది.
వాటిలో వెంటనే తరగతులను ప్రారంభిస్తూ హైస్కూల్ ప్లస్‌గా మార్పు చేస్తున్న నేపథ్యంలో బోధనా, బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టింది. ఈ హైస్కూల్ ప్లస్‌లలో ప్రారంభమయ్యే 11వ తరగతి పిల్లలకు బోధించేందుకు 1,752 మందిని నియమిస్తూ జూలై 7న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తూ పోస్టు గ్రాడ్యుయేషన్ సహా తగిన అర్హతలున్న వారిని పీజీటీ టీచర్లుగా నియమించాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది. వీరికి అదనంగా ఇంక్రిమెంటును మంజూరు చేయాలని పేర్కొంది. అలాగే ఒక్కో స్కూలులో ఓ వాచ్‌మేన్, మరొ జూనియర్ అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను నియమించాలని తెలిపింది.
చదవండి:
Published date : 08 Jul 2022 03:09PM