Skip to main content

Singareni Jobs: సింగరేణి ఉద్యోగులకు గోల్డెన్‌ చాన్స్‌

గోదావరిఖని: సింగరేణిలో పనిచేస్తూ ఉన్నత చదవులు చదివిన ఉద్యోగులకు గోల్డెన్‌ చాన్స్‌ దక్కనుంది.
Golden chance for Singareni employees

 సంస్థ వ్యాప్తంగా 173 పోస్టులను అంతర్గత అభ్యర్థుల ద్వారా భర్తీ చేసేందుకు యాజమాన్యం నిర్ణయించింది. ఈమేరకు ఇటీవల నోటిఫికేషన్‌ జారీచేసింది. మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ ద్వారా సంస్థలో పని చేసి ఉద్యోగ విరమణ పొందిన కార్మికుల స్థానంలో ఉన్నత చదువులు చదివిన యువకులు బదిలీ వర్కర్లుగా ఉద్యోగాలు సాధించారు. గడిచిన 8 ఏళ్లలో ఇ లా 16వేల మందికి పైగా బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీబీఎస్‌, బీఫార్మసీ, ఎంబీఏ, పీహెచ్‌డీ, హెచ్‌ఆర్‌ తది తర ఉన్నత చదువులు చదివిన యువ ఉద్యోగులు సంస్థలో బదిలీ వర్కర్లుగా చేరి జనరల్‌ మజ్దూర్లుగా పదోన్నతి సాధించారు.

చదవండి: Singareni Job Notification: 173 పోస్టులకు సింగరేణి నోటిఫికేషన్‌

అయితే చదువుకు తగిన ఉద్యోగం లభించినా.. ఒకింత ఇబ్బందికి గురవుతూనే విధుల్లో కొనసాగుతున్నారు. యాజమాన్యం ఇందులో కొంత మందికి చదువుకు తగిన యాక్టింగ్‌ ఉద్యోగం కల్పించినా జీతభత్యాల విషయంలో జనరల్‌ మజ్దూర్‌గానే గుర్తింపు ఇచ్చింది. ఇలాంటి వారికోసం సింగరేణిలో ఖాళీగా ఉన్న 173 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ రావడంతో చాలామంది వాటి సాధనపై దృష్టి సారించారు.

173 పోస్టుల భర్తీకి చర్యలు

  • అంతర్గత అభ్యర్ధులతో 173 పోస్టులు భర్తీ చేసేందుకు ఈనెల 7న సింగరేణి యాజమాన్యం నోటిఫికేషన్‌ జారీచేసింది.
  • అర్హులైన అభ్యర్థులు ఈనెల 20 నుంచి వచ్చేనెల 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
  • పూర్తివివరాల కోసం ఈనెల 20వ తేదీ నుంచి సింగరేణి వెబ్‌సైట్‌ https://scclmines. comలో సంప్రదించాలని సూచించింది.
  • రాతపరీక్ష పద్ధతిన మెరిట్‌ ప్రకారం పోస్టుల భర్తీ ఉంటుందని, దీనిలో ఎవరి ప్రమేయం ఉండబోదని స్పష్టం చేసింది.
  • సంస్థ పేరుచెప్పి ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
  • గత నెలలో సింగరేణిలో 321 పోస్టులను ప్రత్యక్ష నియామకాల పద్ధతిన భర్తీ చేసేందుకు నిర్ణయించి తొలివిడతలో 272 పోస్టుల భర్తీకి గతనెల 22న నోఫికేషన్‌ విడుదల చేసింది.
  • మిగిలిన పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ వి డుదల చేస్తామని యాజమాన్యం ప్రకటించింది.

రాతపరీక్ష ద్వారా..

ఉద్యోగులకు పదోన్నతి కల్పించేందుకు రాత పరీక్ష నిర్వహిస్తుంది. మెరిట్‌ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తారు. పరీక్షల రాసిన రోజే మెరిట్‌ లిస్ట్‌ ప్రకటన ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు.

అంతర్గత అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు

  • 173 పోస్టుల భర్తీకి యాజమాన్యం ఆదేశాలు
  • పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ
  • రిక్రూట్‌మెంట్‌ సెల్‌ జీఎం బసవయ్య

దళారులను నమ్మొద్దు

పోస్టులన్నీ రనాతపరీక ఆధారంగా పూర్తిగా మెరిట్‌పై ఆధారపడి ఉంటుంది. దళారులను నమ్మి ఎవరూ మోసపోవద్దు. ప్రలోభాలకు గురికాకుండా ఏసీబీ, సింగరేణి సంస్థ విజిలెన్స్‌ విభాగానికి తెలియజేయాలి. అలాంటి వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. నెలరోజుల ముందే సిలబస్‌కు సంబంధించిన పూర్తి సమాచారం అందిస్తాం.
– బసవయ్య, జీఎం, రిక్రూట్‌మెంట్‌ సెల్‌

సంస్థలో అంతర్గత పదోన్నతి పోస్టులు

జూనియర్‌ మైనింగ్‌ ఆఫీసర్‌: 87
జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌(మెకానికల్‌): 28
జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌(ఎలక్ట్రికల్‌): 21
జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ (సివిల్‌): 11
జూనియర్‌ ఆఫీసర్‌(ఆఫీస్‌ అడ్మినిస్ట్రేషన్‌): 4
జూనియర్‌ ఆఫీసర్‌(అకౌంట్స్‌): 4
బయోకెమిస్ట్‌: 1
జూనియర్‌ ఫారెస్ట్‌ సిస్టెంట్‌: 12
జూనియర్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌: 5
 

Published date : 09 Mar 2024 03:36PM

Photo Stories