Skip to main content

Vidyadhan Scholarship: ఇంటర్‌ రెండేళ్ల కాలానికి ఏడాదికి రూ.6000 చొప్పున అంద‌జేత

Vidyadhan Scholarship

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలలోని ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్య చదివేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా సరోజని దామోదరన్‌ ఫౌండేషన్‌ విద్యాధన్‌ స్కాలర్‌షిప్‌ అందిస్తోంది. ఈ స్కాలర్‌షిప్‌ను తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని పది రాష్ట్రాలలో అమలు చేస్తుంది. ప్రస్తుతం 2021 సంవత్సరానికి విద్యాధన్‌ ప్రకటన వెలువడింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

స్కాలర్‌షిప్‌: ఇంటర్‌ రెండేళ్ల కాలానికి ఏడాదికి రూ.6000 చొప్పున స్కాలర్‌షిప్స్‌ను అందిస్తారు. 

అర్హతలు
పదోతరగతి లేదా తత్సమాన విద్యలో 90శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి‡ ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షలకు మించరాదు.

ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి.. ఆన్‌లైన్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ : https://www.vidyadhan.org 

చ‌ద‌వండి: Scholarships: ‘మైనార్టీ’ ఉపకార వేతనాలకు దరఖాస్తులు

Photo Stories