Skip to main content

Scholarships: సెంట్రల్‌ సెక్టార్‌ స్కీమ్‌ ఆఫ్‌ స్కాలర్‌షిప్‌.. ఏటా రూ.20 వేలు అంద‌జేత‌

Central Sector Scheme of Scholarship

సెంట్రల్‌ సెక్టార్‌ స్కీమ్‌ ఆఫ్‌ స్కాలర్‌ షిప్‌కు నోటిఫికేషన్‌ వెలువడింది. దీన్ని కేంద్ర విద్యాశాఖ ఇస్తుంది. ఈ పథకం కింద ప్రతి ఏటా 82వేల స్కాలర్‌షిప్స్‌ను అందిస్తారు. వీటిలో 50శాతం అమ్మాయిలకు కేటాయిస్తారు. 

అర్హతలు: కనీసం 80శాతం మార్కులతో ఇంటర్‌/తత్సమాన విద్యలో మెరిట్‌ సాధించి ఉండాలి. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఏదైనా విద్యాసంస్థలో రెగ్యులర్‌ విధానంలో గ్రాడ్యుయేట్, పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందాలి. విద్యార్థి కుటుంబ వార్షికాదాయం రూ.8లక్షలకు మించరాదు.
ఆర్థిక ప్రోత్సాహం: డిగ్రీ కోర్సులు, బీఈ/బీటెక్‌ పూర్తయ్యే వరకు ఏటా రూ.10,000 ఇస్తారు. ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్స్‌కు మొదటి మూడేళ్లు పదివేలు, తర్వాతి రెండేళ్లు రూ.20వేలు ఇస్తారు. పీజీ చేస్తున్న వారికి ఏటా రూ.20వేలు అందిస్తారు. 

దరఖాస్తు: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది:  30.11.2021

వెబ్‌సైట్‌: https://scholarships.gov.in

చ‌ద‌వండి: University Grants Commission: యూజీసీ పీజీ స్కాలర్‌షిప్స్‌.. ప్రతి నెల రూ.7800 ఆర్థిక ప్రోత్సాహం

Last Date

Photo Stories