Skip to main content

University Grants Commission: యూజీసీ పీజీ స్కాలర్‌షిప్స్‌.. ప్రతి నెల రూ.7800 ఆర్థిక ప్రోత్సాహం

University Grants Commission

ప్రతిభావంతులైన ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌(యూజీసీ).. పీజీ స్కాలర్‌షిప్‌ 2021 ప్రకటన విడుదల చేసింది. వివిధ యూనివర్సిటీల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయి ప్రొఫెషనల్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తుకు అర్హులు. 

స్కాలర్‌షిప్‌ల సంఖ్య: ఎస్సీ/ఎస్టీ కేటగిరీకి చెందిన మొత్తం 1000 విద్యార్థులకు ఈ పీజీ స్కాలర్‌షిప్స్‌ను అందిస్తారు.
 
అర్హతలు

  • ఇంజనీరింగ్, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, ఫార్మసీ తదితర ప్రొఫెషనల్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంఈ/ఎంటెక్‌ చదివే విద్యార్థులకు నెలకు రూ.7800; ఇతర‡ పీజీ కోర్సులు చదివే విద్యార్థులకు నెలకు రూ.4500 స్కాలర్‌షిప్‌గా లభిస్తుంది. కోర్సులో చేరిన నాటినుంచి ఈ స్కాలర్‌షిప్స్‌ ప్రయోజనాలు వర్తిస్తాయి. 
  • ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఏ ఇన్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం వంటి వాటిని నాన్‌ ప్రొఫెషనల్‌ కోర్సులుగా పరిగణిస్తారు. ఈ విభాగాల్లో పీజీ చేసే వారు పీజీ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ ఫర్‌ ఎస్సీ/ఎస్టీ స్కీమ్‌కు దరఖాస్తుకు అనర్హులు. దూర విద్య ద్వారా పీజీ ప్రొఫెషనల్‌ కోర్సులు చదివే వారికి కూడా అర్హత ఉండదు. 

స్కాలర్‌షిప్‌ నేరుగా ఖాతాకే
ఈ స్కాలర్‌షిప్‌లకు ఎంపికైన అభ్యర్థులకు వారి అకౌంట్‌లోకి యూజీసీ నేరుగా స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని జమ చేస్తుంది. విద్యార్థులు తర్వాతి తరగతికి ప్రమోట్‌ కాకపోతే స్కాలర్‌షిప్‌ నిలిపివేస్తారు.

దరఖాస్తు విధానం

  • విద్యార్థులు నవంబర్‌ 30, 2021 తేదీలోగా నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌ https://scholarships.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. 
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ను విద్యార్థులు చదువుతున్న ఇన్‌స్టిట్యూట్‌ వెరిఫై చేయడం తప్పనిసరి. వెరిఫికేషన్‌ విండో 2021 డిసెంబర్‌ 15 తేదీ వరకు ఓపెన్‌ చేసి ఉంటుంది.

చ‌ద‌వండి: ఈ ప‌థ‌కానికి ఎంపికైతే... ఏడాదికి రూ.12000 అంద‌జేత

Last Date

Photo Stories