Admissions in MS, PhD courses: ఆర్‌సీబీ, ఫరీదాబాద్‌లో ఎంఎస్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు.. నెలకు రూ.16,000 ఫెలోషిప్
ఫరీదాబాద్‌లోని రీజినల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ(ఆర్‌సీబీ).. 2022 సంవత్సరానికి సంబంధించి ఎంఎస్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
ప్రోగ్రామ్ వ్యవధి: 5 నుంచి 7 ఏళ్లు ఉంటుంది.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సైన్స్/ఇంజినీరింగ్/మెడిసిన్ విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్–బయోటెక్నాలజీ(గ్యాట్ బి) పరీక్షలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి ఎంపికచేస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంఎస్–పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌కి ఎంపికచేస్తారు.
ఫెలోషిప్: నెలకు రూ.16,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 06.04.2022
వెబ్‌సైట్: https://rcb.res.in
చదవండి: PG, Doctoral Programs: స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్–విజయవాడలో పీజీ, డాక్టోరల్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు..