Admissions in TISS: టిస్ నెట్-2023 పీజీలో ప్రవేశాలు.. పరీక్షా విధానం ఇలా..
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టిస్).. పోస్ట్ గ్రాడ్యుయేట్‌కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ అర్హత పరీక్ష(నెట్)-2023 నిర్వహించనుంది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం మూడేళ్లు లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ లేదా పీజీ పూర్తిచేసిన వారు అర్హులు. అభ్యర్థులు భారతీయులై ఉండాలి.
పరీక్షా విధానం: ఆన్‌లైన్‌లో పరీక్ష జరుగుతుంది. 100 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 1 గంట 40 నిమిషాలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:15.01.2023.
ప్రవేశ పరీక్ష తేది: దేశవ్యాప్తంగా ఉన్న పరీక్షా కేంద్రాల్లో జనవరి 28, 2023 నుంచి ఫిబ్రవరి 28, 2023 వరకు ప్రవేశ పరీక్ష జరగనుంది.
వెబ్‌సైట్: https://admissions.tiss.edu./
Last Date