Osmania University: ఓయూలో పార్ట్‌టైం ఎంబీఏ కోర్సులో ప్రవేశాలు
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)కి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్... 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు
ఎంబీఏ(టెక్నాలజీ మేనేజ్‌మెంట్) ఈవినింగ్, ఎంబీఏ(పార్ట్‌టైం) ఈవినింగ్.
కోర్సు వ్యవధి: మూడేళ్లు(6 సెమిస్టర్లు)
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు టీఎస్ ఐసెట్–2021లో ర్యాంకు సాధించి ఉండాలి. ఎగ్జిక్యూటివ్/మేనేజీరియల్/అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో రెండేళ్ల అనుభవం తప్పనిసరి. టీఎస్ ఐసెట్‌లో ర్యాంకు సాధించని వారికోసం ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షని మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో(మల్టిపుల్ ఛాయిస్) 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 90 నిమిషాలు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ –500007(తెలంగాణ) చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 04.12.2021
ప్రవేశ పరీక్ష తేది: 05.12.2021
వెబ్‌సైట్: http://www.ouadmissions.com/
చదవండి: JNCASR Admission: జేఎన్‌సీఏఎస్‌ఆర్, బెంగళూరులో రీసెర్చ్ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలు