Skip to main content

FRI courses: అటవీ కోర్సులతో.. ఉజ్వల అవకాశాలు

forest research institute

ప్రపంచ వ్యాప్తంంగా పర్యావరణాన్ని కాపాడటంలో అడవులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పెరుగుతున్న జనాభా, అవసరాల కారణంగా రోజురోజుకు అడవుల విస్తీర్ణం తగ్గిపోతుంది. ఇదే తరుణంలో అడవులను సంరక్షించడం, అటవీ విస్తీర్ణాన్ని పెంచడం కోసం నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరం కూడా పెరుగుతోంది. మానవ వనరుల కొరతను తీర్చడానికి దేశవ్యాప్తంగా పలు సంస్థలను నెలకొల్పి సంబంధిత విభాగంలో శిక్షణను అందిసున్నారు. వీటిలో ఒకటి డెహ్రడూన్‌లోని డీమ్డ్‌ యూనివర్సిటీ అయిన ఫారెస్ట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎఫ్‌ఆర్‌ఐ). ఈ సంస్థలో అటవీ కోర్సులకు సంబంధించి పలు రకాల పీజీ ప్రోగామ్‌లను అందిస్తున్నారు. ప్రస్తుతం 2022 విద్యాసంవత్సరానికి ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో.. కోర్సులపై సమగ్ర సమాచారం...

కోర్సు: ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ
సీట్ల సంఖ్య: 38
అర్హతలు: కనీసం 50శాతం మార్కులతో బోటనీ/కెమిస్ట్రీ/జియాలజీ/మ్యాథ్స్‌ /ఫిజిక్స్‌/జువాలజీల్లో ఏదైనా ఒక సబ్జెక్ట్‌తో బ్యాచిలర్‌ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. 
కోర్సు స్వరూపం: ఈ కోర్సులో భాగంగా అడవుల సంరక్షణ, అడవుల వృద్ధి, పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం, వృక్షాలకు వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై బోధన, శిక్షణ ఇస్తారు.

కోర్సు: ఎమ్మెస్సీ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌
మొత్తం సీట్ల సంఖ్య: 38
అర్హతలు: 50శాతం మార్కులతో బేసిక్‌/అప్లయిడ్‌ సైన్సెస్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా బీఎస్సీ ఫారెస్ట్రీ/అగ్రికల్చర్‌ లేదా బీఈ ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్‌ చదివి ఉండాలి.
కోర్సు స్వరూపం: ఈ కోర్సులో పర్యావరణానికి ఎదురయ్యే సమస్యలు, వాటిని అధిగమించేందుకు తీసుకొవాల్సిన చర్యలు, వాతావర ణంలో జరుగుతున్న మార్పులు, జీవవైవిధ్యంపై వాటి ప్రభావం వంటివి కోర్సులో భాగంగా నేర్చుకుంటారు. 

కోర్సు: ఎమ్మెస్సీ సెల్యూలోజ్‌ అండ్‌ పేపర్‌ టెక్నాలజీ 
మొత్తం సీట్ల సంఖ్య: 20
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా సైన్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణత లేదా 50శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ కెమికల్‌/మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
కోర్సు స్వరూపం: వృక్షాల నుంచి కాగితాలను తయారు చేసే విధానం, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి.. పెద్ద మొత్తంలో కాగితాన్ని తయారు చేయడం వంటి అంశాలను తెలుసుకుంటారు. 

కోర్సు: ఎమ్మెస్సీ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
మొత్తం సీట్ల సంఖ్య: 38
అర్హత: 50శాతం మార్కులతో ఎంపీసీ గ్రూప్‌లో బీఎస్సీ లేదా బీఎస్సీ ఫారెస్ట్రీ ఉత్తీర్ణత ఉండాలి.
కోర్సు స్వరూపం: కలప సంరక్షణ, అలాగే వివిధ ఉత్పత్తుల్లో వాటిని ఏ విధంగా ఉపయోగించాలి అనే అంశాలను కోర్సులో భాగంగా తెలియజేస్తారు.

ప్రవేశాలు ఇలా: 
రాత పరీక్ష ద్వారా ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

పరీక్ష విధానం: 
సైన్స్, సోషల్‌ సైన్స్‌లో బేసిక్‌ కాన్సెప్ట్‌ల నుంచి ప్రశ్నలను అడుగుతారు. ఇందులో అర్థమెటిక్, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీస్, కంప్యూటేషనల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ రీజనింగ్, జనరల్‌ నాలెడ్జ్, కరెంట్‌ అఫైర్స్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, కాంప్రహెన్షన్, వొకాబ్యులరీ, గ్రామర్, ఇడియమ్స్‌ నుంచి ప్రశ్నలుంటాయి. నెగిటివ్‌ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు చొప్పున కోత విధిస్తారు. 

అవకాశాలు
ఆయా కోర్సులు పూర్తిచేసుకున్న వారికి ప్రభుత్వ సంస్థలు, ఎన్‌జీవోలు, కాగిత పరిశ్రమ, వస్తు తయారీ, ప్యాకింగ్‌ సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

దరఖాస్తు ఇలా

  • ఈ పరీక్షకు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. యూనివర్సిటీ వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకొవాలి. పూర్తి వివరాలు నింపి, అవసరమైన సర్టిఫికెట్లు, రూ.1500 డీడీ జత చేసి ‘ఫారెస్ట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, డెహ్రాడూన్‌కు పోస్టులో పంపాలి.
  • పరీక్షను ఆన్‌లైన్‌ రిమోట్‌ ప్రొక్టోర్డ్‌ విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష తేదీలు, పరీక్ష నిర్వాహణ(ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌) విధానంలో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 19, 2022
  • పరీక్ష తేదీ: మే 22, 2022
  • పరీక్ష విధానం: ఆఫ్‌లైన్‌ లేదా ఆన్‌లైన్‌లో ఉంటుంది.
  • వెబ్‌సైట్‌: http://fridu.edu.in/

చ‌ద‌వండి: Admissions in FRI: ఎఫ్‌ఆర్‌ఐ, డెహ్రాడూన్‌లో ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..

Last Date

Photo Stories