IIFPT Admission: ఐఐఎఫ్‌పీటీలో యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు
తంజావూరు(తమిళనాడు)లోని నిఫ్టెమ్–ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ(ఐఐఎఫ్‌పీటీ).. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు
బీటెక్ ప్రోగ్రామ్(ఫుడ్ టెక్నాలజీ):
కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.
అర్హత: ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణతతోపాటు జేఈఈ(మెయిన్)–2021లో అర్హత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: ఆల్ ఇండియా జేఈఈ(మెయిన్)2021 ర్యాంక్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఎంటెక్ ప్రోగ్రామ్(ఫుడ్ టెక్నాలజీ):
విభాగాలు: ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెస్ టెక్నాలజీ, ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్.
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం:యూజీ మార్కులు, నిఫ్టెమ్–టీ–ఐఐఎఫ్‌పీటీ ఆన్‌లైన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపికచేస్తారు.
పీహెచ్‌డీ ప్రోగ్రామ్(ఫుడ్ టెక్నాలజీ):
విభాగాలు: ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెస్ టెక్నాలజీ.
అర్హత: కనీసం 55శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: యూజీ, పీజీ మార్కులు, నిఫ్టెమ్–టీ–ఐఐఎఫ్‌పీటీ ఆన్‌లైన్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంటెక్ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తులకు చివరి తేది: 25.10.2021
పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తులకు చివరి తేది: 15.12.2021
వెబ్‌సైట్: http://iifpt.edu.in/