NIPER JEE 2022: ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులు
» నైపర్ క్యాంపస్‌ల్లో పీజీ, పీహెచ్‌డీ, ఐపీహెచ్‌డీ
» నైపర్ జేఈఈ స్కోర్‌తో ప్రవేశాలు
» భవిష్యత్తులో సమున్నత అవకాశాలు
» నైపర్–జేఈఈ–2022 నోటిఫికేషన్ విడుదల
ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ
నైపర్‌లలో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తం ఆరేళ్ల వ్యవధిలో ఉండే ఈ ప్రోగ్రామ్‌లకు ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో స్కోర్ సాధించి సీటు సొంతం చేసుకున్న వారికి మొదటి రెండేళ్లు పీజీ ఫెలోషిప్, ఆ తర్వాత నాలుగేళ్లు పీహెచ్‌డీ ఫెలోషిప్ పేరుతో ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తారు.
Also read: TS EDCET 2022 : బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు.. పరీక్షా విధానం ఇలా..
అర్హత
అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ స్పెషలైజేషన్‌ను అనుసరించి బీఫార్మసీ, ఎమ్మెస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ/అనలిటికల్ కెమిస్ట్రీ), బీవీఎస్సీ, ఎంబీబీఎస్, ఎమ్మెస్సీ(ఫార్మకాలజీ/టాక్సికాలజీ/లైఫ్ సైన్సెస్/బయె కెమిస్ట్రీ/ మెడిసినల్ బయో కెమిస్ట్రీ/జువాలజీ/బయలాజికల్ సైన్సెస్), బీటెక్(బయో ఇన్ఫర్మాటిక్స్), ఎమ్మెస్సీ(ఫార్మాస్యుటికల్ కెమిస్ట్రీ/ఫిజికల్ కెమిస్ట్రీ/మాలిక్యులర్ బయాలజీ/బయో ఇన్ఫర్మాటిక్స్/మైక్రోబయాలజీ), బీటెక్(కెమికల్ ఇంజనీరింగ్/ ఫార్మాస్యుటికల్ ఇంజనీరింగ్) తదితర కోర్సుల్లో 6.75 సీజీపీఏతో ఉత్తీర్ణత ఉండాలి. దీంతోపాటు జీప్యాట్/గేట్/నెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
Chennai Mathematical Institute Admissions: సీఎంఐ నోటిఫికేషన్ విడుదల.. అందించే కోర్సులు, కావాల్సిన అర్హతలు ఇవే..
ప్రవేశం ఇలా
ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నైపర్ జేఈఈ 200 ప్రశ్నలతో ఉంటుంది. ఈ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి, ఎంపికైన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ రెండింటిలోనూ పొందిన మార్కుల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. వారికి ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ద్వారా సీట్ల కేటాయింపు చేస్తారు.
Also read: NIPER 2022: నైపర్–జేఈఈ పీహెచ్‌డీ ఎంట్రన్స్... అర్హతలు
ముఖ్య తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తు: ఏప్రిల్ 4 – మే 3
- ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ నైపర్ జేఈఈ పరీక్ష తేదీ: జూన్ 12
- ఫలితాల వెల్లడి: జూన్ 21
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్:www.niperhyd.ac.in
Also read: Pharmaceutical Research Career: నైపర్ క్యాంపస్‌ల్లో పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో అడుగుపెడితే... ఉజ్వల కెరీర్ ఖాయం!!