NIPER 2022: నైపర్–జేఈఈ పీహెచ్‌డీ ఎంట్రన్స్... అర్హతలు
దేశ వ్యాప్తంగా ఉన్న నైపర్ క్యాంపస్‌లలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి ప్రత్యేకంగా ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. అభ్యర్థులు నెపర్–జేఈఈ ఆన్‌లైన్ దరఖాస్తును పూర్తి చేసేటప్పుడే పీహెచ్‌డీ ప్రోగ్రామ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.
అర్హతలు
అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న విభాగాలకు సంబంధించి.. ఎంఎస్, ఎంఫార్మసీ, ఎంటెక్ కోర్సులను సదరు స్పెషలైజేషన్లతో 6.5 సీజీపీఏతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్‌సీ, ఎస్‌టీ కేటగిరీ అభ్యర్థులు 6.25 సీజీపీఏ లేదా 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. జీప్యాట్/గేట్/సీఎస్‌ఐఆర్–యూజీసీ నెట్ ఉత్తీర్ణత ఉండాలి. ఎండీ, ఎంవీఎస్‌సీ, ఎండీఎస్, ఫార్మ్–డి ఉత్తీర్ణులకు జీప్యాట్ /నెట్/గేట్ నిబంధన నుంచి మినహాయింపు.
Also read: NIPER JEE 2022: ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులు
నైపర్–జేఈఈ పీహెచ్‌డీ ఎంట్రన్స్ ఇలా
పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నిర్వహించే నైపర్–జేఈఈ 170 ప్రశ్నలకు ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. మొత్తం మార్కులు 85. కెమికల్ సైన్సెస్, బయలాజికల్ సైన్సెస్, ఫార్మాస్యుటికల్ సైన్సెస్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. పీహెచ్‌డీ అభ్యర్థులకు వారు ఎంట్రన్స్‌లో పొందిన స్కోర్ ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి.. చివరగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
Also read: NCHM JEE 2022: బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుల్లో ప్రవేశాలు
సీటు పొందితే.. స్టయిఫండ్
పీహెచ్‌డీలో ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి రెండేళ్లు నెలకు రూ.31 వేలు చొప్పున; మూడు, నాలుగు సంవత్సరాలు నెలకు రూ.35 వేలు చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం లభిస్తుంది. దీంతోపాటు హెచ్‌ఆర్‌ఏ కూడా అందుతుంది. పీహెచ్‌డీ అభ్యర్థులకు గరిష్టంగా మూడేళ్ల వ్యవధి లభిస్తుంది. తర్వాత వారు చేస్తున్న ప్రాజెక్ట్ ఆధారంగా దాన్ని పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయి.
Also read: Pharmaceutical Research Career: నైపర్ క్యాంపస్‌ల్లో పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో అడుగుపెడితే... ఉజ్వల కెరీర్ ఖాయం!!
నైపర్ జేఈఈ –పీహెచ్‌డీ ఎంట్రన్స్
ముఖ్య సమాచారం
- ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: ఏప్రిల్ 4–మే3, 2022
- హాల్‌టికెట్ డౌన్‌లోడ్ సదుపాయం:మే16 నుంచి
- నైపర్ జేఈఈ ఆన్‌లైన్ టెస్ట్ తేదీ:జూన్ 12,2022
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్:www.niperhyd.ac.in