Pharmaceutical Research Career: నైపర్ క్యాంపస్‌ల్లో పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో అడుగుపెడితే... ఉజ్వల కెరీర్ ఖాయం!!
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్.. నైపర్! జాతీయ స్థాయిలో.. ఫార్మా రంగంలో ఉన్నత విద్యకు సమున్నత వేదికలుగా నిలుస్తున్న.. ఇన్‌స్టిట్యూట్‌లు.. నైపర్ క్యాంపస్‌లు! ఇవి అందించే పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో అడుగుపెడితే.. భవిష్యత్తులో ఫార్మా రంగంలో ఉజ్వల కెరీర్ ఖాయం!! ఇందుకోసం.. విద్యార్థలు చేయాల్సిందల్లా.. నైపర్ క్యాంపస్‌లలో.. పీజీ, పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సుల్లో.. ప్రవేశానికి నిర్వహించే.. నైపర్–జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (నైపర్ –జేఈఈ)లో.. స్కోర్ సాధించడమే! ఈ స్కోర్ ఆధారంగా.. దేశ వ్యాప్తంగా ఉన్న నైపర్ క్యాంపస్‌లలో.. ఆయా కోర్సుల్లో అడ్మిషన్ లభిస్తుంది. తాజాగా నైపర్–జేఈఈ–2022కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. నైపర్–జేఈఈ తీరుతెన్నులు, నైపర్ క్యాంపస్‌ల ప్రాధాన్యం, అందించే కోర్సులు, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం..
Also read: NIPER 2022: నైపర్–జేఈఈ పీహెచ్‌డీ ఎంట్రన్స్... అర్హతలు
ఫార్మా రంగం.. గత దశాబ్ద కాలంగా వెలుగులీనుతున్న రంగం. అటు మార్కెట్ కోణంలో.. ఇటు ఉద్యోగ కల్పనలో.. టాప్–5 జాబితాలో నిలుస్తోంది. ఈ రంగంలో అవకాశాలు సొంతం చేసుకోవాలంటే.. పీజీ, పీహెచ్‌డీ స్థాయిలో సంబంధిత స్పెషలైజేషన్లలో నైపుణ్యాలు తప్పనిసరి. ఆయా నైపుణ్యాలను అందిస్తున్న సంస్థలు నైపర్ క్యాంపస్‌లు. వీటిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష.. నైపర్–జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్.
Also read: Central Government Jobs: ఎంబీబీఎస్‌తో.. కేంద్రంలో వైద్య కొలువు
ఎందుకింత ప్రాధాన్యం
ఫార్మసీ రంగానికి అవసరమైన నిపుణులను అందించే లక్ష్యంగా నైపర్ క్యాంపస్‌లు ఏర్పాటయ్యాయి. ఫార్మసీ నిపుణులను తీర్చిదిద్దే సంకల్పంతో నైపర్(నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) క్యాంపస్‌లు వివిధ కోర్సులు అందిస్తున్నాయి.‘మాస్టర్స్, పీహెచ్‌డీ స్థాయి కోర్సుల ద్వారా సంపూర్ణ నైపుణ్యాలు అందించే సిలబస్,కరిక్యులం రూపొందించారు. అంతేకాకుండా నైపర్ క్యాంపస్‌లు ఇండస్ట్రీ, రీసెర్చ్ ల్యాబ్స్‌తో ఒప్పందాల ద్వారా ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందుకే వీటికి జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ గుర్తింపు లభిస్తోంది.
Also read: Admissions in Central university: సీయూఈటీకి.. సిద్ధం కావాలి ఇలా
ఏడు క్యాంపస్‌లు
ప్రస్తుతం జాతీయ స్థాయిలో మొత్తం ఏడు నైపర్ క్యాంపస్‌లు అందుబాటులో ఉన్నాయి. అవి.. అహ్మదాబాద్;గువహటి;హజీపూర్;హైదరాబాద్; కోల్‌కత; రాయ్‌బరేలి; ఎస్.ఎ.ఎస్.నగర్. వీటిలో ఎం.ఫార్మసీ, పీహెచ్‌డీ, పోస్ట్ డాక్టోరల్ స్టడీస్ స్థాయిలో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
బీఫార్మసీ విద్యార్థులకు వరంగా
నైపర్–జేఈఈ పరీక్షను.. బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ(బీఫార్మసీ) ఉత్తీర్ణులకు వరంగా పేర్కొనొచ్చు. కారణం.. బీఫార్మసీ అర్హతతో నైపర్–జేఈఈలోని పీజీ ఎంట్రన్స్‌లో స్కోర్ సొంతం చేసుకుంటే.. ప్రతిష్టాత్మక నైపర్ క్యాంపస్‌లలో అడుగు పెట్టే అవకాశం లభిస్తుంది.
పీజీ ప్రోగ్రామ్‌లు ఇవే
- దేశ వ్యాప్తంగా ఏడు నైపర్ క్యాంపస్‌లలో మొత్తం పదహారు పీజీ ప్రోగ్రామ్‌లు అందబాటులో ఉన్నాయి. పీజీ స్థాయిలో కోర్సుల పేర్లు వేర్వేరుగా పేర్కొంటున్నారు. అవి.. ఎంఎస్–ఫార్మసీ; ఎం.ఫార్మసీ;ఎంటెక్–ఫార్మసీ;ఎంబీఏ–ఫార్మసీ. ఈ నాలుగు విభాగాలకు సంబంధించి పదహారు స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. అవి...
- ఎంఎస్–ఫార్మసీ: మెడిసినల్ కెమిస్ట్రీ; నేచురల్ ప్రొడక్ట్స్; ట్రెడిషనల్ మెడిసిన్; ఫార్మాస్యుటికల్ అనాలిసిస్; ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ; రెగ్యులేటరీ టాక్సికాలజీ; ఫార్మాస్యుటిక్స్; బయో టెక్నాలజీ; ఫార్మకో ఇన్ఫర్మాటిక్స్; మెడికల్ డివైజెస్, రెగ్యులేటరీ అఫైర్స్.
- ఎం.ఫార్మసీ: ఫార్మాస్యుటికల్ టెక్నాలజీ(ఫార్ములేషన్స్); ఫార్మసీ ప్రాక్టీస్; క్లినికల్ రీసెర్చ్.
- ఎంటెక్ ఫార్మసీ: ఫార్మాస్యుటికల్ టెక్నాలజీ(ప్రాసెస్ కెమిస్ట్రీ); ఫార్మాస్యుటికల్ టెక్నాలజీ(బయో టెక్నాలజీ).
- ఎంబీఏ(ఫార్మాస్యుటికల్ మేనేజ్‌మెంట్).
Also read: After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భవిష్యత్ ఉంటుంది..?
నైపర్–జేఈఈ అర్హతలు
- బీఫార్మసీ తత్సమాన కోర్సులో 6.75 సీజీపీఏ లేదా అంతకు సమానమైన పర్సంటేజీతో ఉత్తీర్ణత ఉండాలి
- అభ్యర్థులు జీప్యాట్ లేదా గేట్ లేదా సీఎస్‌ఐఆర్–యూజీసీ నెట్ స్కోర్‌లు సొంతం చేసుకుని ఉండాలి.
- ఆయా కోర్సుల్లో ప్రవేశానికి నైపర్–జేఈఈ పరీక్ష నిర్వహిస్తారు.
- ఆయా కోర్సులకు సంబంధించి అర్హతగా పేర్కొన్న బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో కనీసం అరవై శాతం మార్కులు లేదా 6.75 జీపీఏతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
- రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో 50 శాతం మార్కులు లేదా 5.75 సీజీపీఏ సాధిస్తే సరిపోతుంది. ఈ ఏడాది చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
Also read: Admissions in Central university: సీయూఈటీకి.. సిద్ధం కావాలి ఇలా
ఆన్‌లైన్ విధానంలో పరీక్ష
- నైపర్ జేఈఈ పరీక్షు ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం 200 ప్రశ్నలు–200 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం రెండు గంటలు. పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
- ఈ పరీక్షలో మెరుగైన ర్యాంకు పొందాలంటే.. అభ్యర్థులు బీఫార్మసీ స్థాయిలోని అకడమిక్స్‌పై పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలి.
- కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, బయోటెక్నాలజీ, ఫార్మాస్యుటికల్ అనాలిసిస్ విభాగాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మొత్తం 200 ప్రశ్నల్లో 70 శాతం మేర ప్రశ్నలు ఈ విభాగాల నుంచే ఉంటున్నాయి. కొన్ని ప్రశ్నలు జనరల్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించినవి ఉంటున్నాయి.
- కోర్ సబ్జెక్ట్‌లకు సంబంధించి బీఫార్మసీలో పొందిన నైపుణ్యం, జీప్యాట్ సన్నద్ధతతో రాణించేందుకు వీలుంది. ఫార్మకాలజీలో రిసెప్టర్స్, వాటి రకాలు, మెకానిజమ్ ఆఫ్ యాక్షన్, ఔషధాల వర్గీకరణ, క్లినికల్ ట్రయల్స్‌పై అవగాహన, ప్రీ–క్లినికల్ ట్రయల్స్ అంశాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. డ్రగ్ డిస్కవరీకి సంబంధించి ముఖ్యంగా వాటి ప్రాముఖ్యతలు, రియాక్షన్స్‌పై అవగాహన పెంచుకోవాలి.
Also read: Distance and Online Learning: యూజీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ మొదలు.. ప్రవేశ సమయంలో తీసుకోవాల్సిన..
ఎంబీఏ.. జీడీ/పీఐ
నైపర్ క్యాంపస్‌లలో అందుబాటులో ఉన్న ఎంబీఏ ఫార్మా మేనేజ్‌మెంట్ కోర్సులో ప్రవేశానికి నైపర్–జేఈఈలో ఉత్తీర్ణతతోపాటు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలోనూ రాణించాల్సి ఉంటుంది. నైపర్–జేఈఈకి 85 శాతం వెయిటేజీ; గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ రెండింటికీ కలిపి 15 శాతం వెయిటేజీ ఇస్తారు.
ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారా సీట్ల భర్తీ
నైపర్–జేఈఈలో నిర్దేశిత కటాఫ్ మార్కులు పొందిన అభ్యర్థులకు ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ కౌన్సెలింగ్ సమయంలో అందుబాటులో ఉన్న సీట్లు.. నిర్దిష్ట కటాఫ్ మార్కులు పొందిన అభ్యర్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని తుది జాబితా రూపొందిస్తారు.
ఆర్థిక ప్రోత్సాహం
అన్ని దశల్లోనూ విజయం సాధించి నైపర్ క్యాంపస్‌లో ప్రవేశం ఖరారు చేసుకున్న అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం కూడా లభిస్తోంది. ప్రతి విద్యార్థికి నెలకు రూ.12,400 స్టయిఫండ్ లభిస్తుంది. ఈ స్టయిఫండ్ కొనసాగాలంటే ప్రతి సెమిస్టర్‌లోనూ తప్పనిసరిగా జీపీఏ ఆరు పాయింట్లు కొనసాగించాలి.
Also read: NIPER 2022: నైపర్–జేఈఈ పీహెచ్‌డీ ఎంట్రన్స్... అర్హతలు
నైపర్–జేఈఈ 2022 సమాచారం
- ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: ఏప్రిల్ 4 నుంచి మే 3 వరకు
- హాల్‌టికెట్ డౌన్‌లోడ్ సదుపాయం: మే 16, 2022
- నైపర్ జేఈఈ ఆన్‌లైన్ పరీక్ష తేదీ: జూన్ 12, 2022
- ఫలితాల వెల్లడి: జూన్ 21, 2022
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.niperhyd.ac.in